Road Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్ - దారుణమైన విజువల్స్

ఆదివారం సాయంత్రం రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. యాత్రికులతో వెళ్తున్న ఒక టెంపో ట్రావెల్ వాహనం.. ఒక ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది యాత్రికులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.

New Update
BREAKING

BREAKING

ఇవాళ రాజస్థాన్‌లోని జైపూర్‌లో మరో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. జైపూర్‌లో ఒక డంపర్ ప్రజలకు ప్రాణాపాయంగా మారింది. లోహా మండి ప్రాంతంలో వేగంగా వచ్చిన ఒక డంపర్ అదుపుతప్పిఅనేక వాహనాలను ఢీకొట్టింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అనేక వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ భయానక ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 10 మంది మరణించారు. మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు. అదే సమయంలో ఈ దుర్ఘటనలో దాదాపు 10కి పైగా వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇవాళ మధ్యాహ్నం హర్మాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహా మండీ ప్రాంతంలో ఒక డంపర్ అత్యంత వేగంగా వెళ్లింది. అది కాస్త ఆ స్పీడ్‌లో అదుపుతప్పి రోడ్డుపై ప్రయాణిస్తున్న పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. 

పోలీసుల ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో డంపర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ముందున్న వాహనాలను బలంగా ఢీకొట్టాడు. దాదాపు 10 నుంచి 12 వాహనాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యాయి. అందులో ఎక్కువగా బైక్‌లు, కార్లు, ఆటోలు ఉన్నాయి. దీంతో రోడ్డుపై భీకరమైన శబ్దాలు, ప్రజల ఏడుపులతో వాతావరణం విషాదకరంగా మారింది. 

ఈ ఘోరమైన విషాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. అనంతరం గాయపడిన వారిని సమీప హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. వీరిలో ఇంకొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 

Also Read :  ఓరి దేవుడా.. వాళ్లు 12 గంటలు ఆడారు మేడమ్.. సీఎం మమతా బెనర్జీ ట్వీట్ కు బీజేపీ కౌంటర్!

Jaipur Loha Mandi Accident 

Also Read :  అంబులెన్స్ టైర్ పంక్చర్.. రోగి మృతి!

ఇదిలా ఉంటే నిన్న (ఆదివారం) సాయంత్రం రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(rajastan bus incident) జరిగిన విషయం తెలిసిందే. యాత్రికులతో వెళ్తున్న ఒక టెంపో ట్రావెల్ వాహనం.. ఒక ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది యాత్రికులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. కాగా మృతులంతా ఒకే ఫ్యామిలీకి చెందిన వారు కావడంతో గ్రామమంతా కన్నీరుమున్నీరైంది.

Advertisment
తాజా కథనాలు