Mamata Banerjee : ఓరి దేవుడా.. వాళ్లు 12 గంటలు ఆడారు మేడమ్.. సీఎం మమతా బెనర్జీ ట్వీట్ కు బీజేపీ కౌంటర్!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలుపుతూ చేసిన ట్వీట్‌పై  బీజేపీ కౌంటర్ ఇచ్చింది. మహిళలు అర్థరాత్రి బయటకు వెళ్లడంపై ఆమె ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తుచేస్తూ తీవ్ర విమర్శలు చేసింది. 

New Update
mamatha

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలుపుతూ చేసిన ట్వీట్‌పై  బీజేపీ కౌంటర్ ఇచ్చింది. మహిళలు అర్థరాత్రి బయటకు వెళ్లడంపై ఆమె ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తుచేస్తూ తీవ్ర విమర్శలు చేసింది. 

"ప్రపంచ కప్ ఫైనల్‌లో మన ఉమెన్ ఇన్ బ్లూ ఘనత పట్ల నేడు దేశం మొత్తం గర్వంగా ఉంది. మీరు చూపించిన పోరాటం, టోర్నమెంట్ అంతటా ప్రదర్శించిన కమాండ్ తరతరాలుగా యువతులకు ప్రేరణగా నిలుస్తాయి. మీరు అత్యున్నత స్థాయిలో ప్రపంచ స్థాయి జట్టు అని నిరూపించుకున్నారు.  మీరు మాకు కొన్ని అద్భుతమైన క్షణాలను అందించారు. మీరు మా హీరోలు. భవిష్యత్తులో అనేక పెద్ద విజయాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. మేము మీతో నిలబడతాము!" అని బెనర్జీ ట్వీట్ చేశారు. 

వాళ్ళు 12 గంటల వరకు ఆడుకుంటున్నారు

అయితే దీనిపై బీజేపీ స్పందించింది“ఓరి దేవుడా వాళ్ళు 12 గంటల వరకు ఆడుకుంటున్నారు కానీ మీరు వాళ్ళని 8 గంటలకల్లా ఇంటికి చేరుకోమని చెప్పారు కదా మేడమ్ అంటూ ట్వీట్ చేసింది. మేడమ్, ఈ 'ఉమెన్ ఇన్ బ్లూ' రాత్రి 8 గంటలకన్నా ముందే ఇంటికి వచ్చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత రాష్ట్రంలో భద్రతకు గ్యారంటీ లేదు కదా అంటూ వ్యంగస్ర్తాలు సంధిచింది. 

బెంగాల్‌లో మహిళల భద్రతపై ప్రశ్నలు వచ్చినప్పుడు, గతంలో సీఎం మమతా బెనర్జీ "మీరు 8 గంటలకల్లా ఇంటికి రావాలి" అని మహిళలకు సలహా ఇచ్చినట్లుగా ప్రతిపక్షాలు తరచుగా ప్రస్తావిస్తుంటాయి. ప్రస్తుత ప్రపంచ కప్ విజయాన్ని ఈ పాత వ్యాఖ్యలతో ముడిపెట్టి బీజేపీ ఈ సెటైర్ వేసింది. బీజేపీ చేసిన ఈ ట్రోలింగ్ సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.

Advertisment
తాజా కథనాలు