Donald Trump: పాక్‌ అణ్వాయుధాలు పరీక్షిస్తోంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని తెలిపారు

New Update
Trump says Pakistan testing nuclear weapons, defends US' move to resume trials

Trump says Pakistan testing nuclear weapons, defends US' move to resume trials

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని తెలిపారు. CBS న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. '' చైనా, రష్యా, నార్త్‌ కొరియా, పాకిస్థాన్‌ లాంటి దేశాలు అణు పరీక్షలను నిర్వహిస్తున్నాయి. కానీ వీటి గురించి ఆ దేశాలు మాట్లాడటం లేదు. మేము మాత్రం దాని గురించి బహిరంగంగానే మాట్లాడుతాం.

Also Read: అదిరిపోయింది భయ్యా... టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీగా కొత్త యాప్‌

Trump Says Pakistan Testing Nuclear Weapons

ఇప్పటివరకు ఏ దేశాలు అణ్వాయుధ పరీక్షలు చేసినా మేము వాటి జోలికి వెళ్లలేదు. కానీ ఇకనుంచి అలా మిగిలిపోవాలని అనుకోవడం లేదు. ఇతర దేశాల లాగే మేము కూడా అణు పరీక్షలు నిర్వహిస్తాం. అణు ఆయుధాలు రష్యా, చైనా వద్ద ఎక్కువగా ఉండి ఉండాయి. మా దగ్గర మాత్రం అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. మా దగ్గర ఉన్న అణ్వాయుధాలతో ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయవచ్చు. ఈ ఆయుధాల నిరాధీకరణ గురించి పుతిన్, జిన్‌పింగ్‌తో కూడా చర్చించాను. ఇప్పటికే అమెరికా అణు పరీక్షలకు ఏర్పాట్లు ప్రారంభించిందని'' ట్రంప్‌ అన్నారు. అయితే ఈ పరీక్షలు ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. 

Also Read: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్ - దారుణమైన విజువల్స్

ఇదిలాఉండగా ఇటీవల దక్షిణ కొరియా(South Korea) లోని బుసాన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందే ట్రంప్ దీని గురించి ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అణ్వాయుధ పరీక్షలు చేయకూడదని నిర్ణయించుకున్నానని.. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారాయని తెలిపారు. రష్యా, చైనాతో పాటు ఇతర దేశాలు కూడా తమ అణ్వాయుధాల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా, రష్యా, చైనా ఐదేళ్లలోపు సమాన స్థాయికి చేరుకునే ఛాన్స్ ఉంది. అందుకోసమే మళ్లీ అమెరికా అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని'' ట్రంప్ రాసుకొచ్చారు.  

Also Read: ఓరి దేవుడా.. వాళ్లు 12 గంటలు ఆడారు మేడమ్.. సీఎం మమతా బెనర్జీ ట్వీట్ కు బీజేపీ కౌంటర్!

Advertisment
తాజా కథనాలు