Road Accident : వరంగల్‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న డాక్టర్‌ మృతి

వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న వైద్యురాలు ఎస్‌.మమతారాణి మృతి చెందింది. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన మమత వరంగల్ హంటర్‌రోడ్డులోని ఫాదర్‌ కొలంబో ఆస్పత్రిలో జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో పనిచేస్తున్నారు.  

New Update
FotoJet (16)

A pregnant doctor dies in a road accident

Road Accident In Warangal

వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా (9 నెలల గర్భిణి) ఉన్న వైద్యురాలు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఆమెను డాక్టర్‌ ఎస్‌.మమతారాణిగా గుర్తించారు.  మట్టెవాడ ఎస్సై శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక(karnataka) లోని గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన ఎస్‌.మమతారాణి  వరంగల్ హంటర్‌రోడ్డులోని ఫాదర్‌ కొలంబో ఆస్పత్రిలో జనరల్‌ మెడిసిన్‌ విభాగం(indian-female-doctor) లో పనిచేస్తున్నారు.  గతేడాది నారాయణపేట జిల్లాకు చెందిన డాక్టర్‌ రాఘవేంద్రతో ఆమెకు వివాహం జరిగింది.  సోమవారం రాత్రి విధులు ముగించుకుని భర్త డాక్టర్‌ రాఘవేంద్రతో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, ఏడు మోరీల కూడలి వద్ద వెనుక నుంచి వచ్చిన టిప్పర్‌(tipper-lorry) వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. - latest telangana news

Also Read :  సంతోష్ రావు రేవంత్ రెడ్డి సీక్రెట్ ఏజెంట్.. SIT విచారణ వేళ కవిత సంచలన ఆరోపణలు!

ఈ ప్రమాదంలో 9 నెలల గర్భిణీ అయిన డాక్టర్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.స టిప్పర్‌ డ్రైవర్‌ అన్సారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఝార్ఖండ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read :  ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు.. స్పాట్ లో 19 మంది ప్రయాణీకులు

Advertisment
తాజా కథనాలు