సంతోష్ రావు రేవంత్ రెడ్డి సీక్రెట్ ఏజెంట్.. SIT విచారణ వేళ కవిత సంచలన ఆరోపణలు!

నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియాతో వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోడుకు వరుస అయ్యే సంతోష్ రావుని ఆమె దయ్యంతో పోలుస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

New Update
santosh

ఫోన్ టాపింగ్ విచారణ సందర్భంగా కేసీఆర్ కుటుంబంలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఫోన్ టాపింగ్ కేసులో సంతోష్ రావు విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసులు పంపిన వేళ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న కవిత.. ఇప్పుడు ఆ దయ్యం ఎవరో చెప్పేసింది. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియాతో వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోడుకు వరుస అయ్యే సంతోష్ రావుని ఆమె దయ్యంతో పోలుస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Also Read: రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ ట్రెండ్.. అసలు నిజం ఏంటి? వైరల్ అవుతున్న కథ వెనక వాస్తవం ఇదే!

సంతోష్ రావు కేసీఆర్ కళ్లుగప్పి ఉద్యమకారులను ఆయనకు దూరం చేశారని కవిత ఆరోపించారు. "నేను మొదటి నుంచీ చెబుతున్నాను.. ఈ సంతోష్ రావు ఒక దయ్యం. ఉద్యమ నాయకుడిని సొంత మనుషులకు దూరం చేసింది అతనే. చివరకు గద్దర్ లాంటి గొప్ప నాయకులు కూడా గేటు బయటే ఉండాల్సి వచ్చిందంటే అది సంతోష్ రావు కుట్రల వల్లే" అని ఆమె మండిపడ్డారు. అంతేకాకుండా, సంతోష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్ అని వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు.

Also Read: రౌడీ హీరో సినిమా ‘రణబాలి’ పై AI ఎఫెక్ట్.. డైరెక్టర్ ఏమన్నాడంటే..?

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, గృహహింస పెరిగిపోతోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ పోలీసులు అంటే గంజాయి స్మగ్లర్లకు భయం లేకుండా పోయిందని, వారి వద్ద ఆయుధాలు ఉంటేనే నేరగాళ్లు భయపడతారని ఆమె అభిప్రాయపడ్డారు. ఫారెస్ట్, ఎక్సైజ్ అధికారులకు తిరిగి వెపన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 'గుంపు మేస్త్రీ' పాలనగా అభివర్ణించిన కవిత, సంతోష్ రావు లాంటి వ్యక్తులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదని విమర్శించారు. సంతోష్ రావును సిట్ (SIT) విచారణకు పిలవడం సరైనదే కానీ, ఆయనకు ఎలాంటి శిక్ష విధిస్తారో వేచి చూడాలని అన్నారు. "సొంత నీడను కూడా నమ్మలేని పరిస్థితి ఉంది. కేసీఆర్‌కి తెలియకుండా సంతోష్ చాలా విషయాలు కప్పిపుచ్చారు" అని ఆమె పేర్కొన్నారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు