/rtv/media/media_files/2025/02/10/P58Ju5zYJQfrGWglWCo7.jpg)
Two sisters found dead in Hyderabad
TG Crime : హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందటం కలకలం రేపింది. ఒకే ఇంట్లో ఇద్దరు యువతులు శనివారం అనుమానస్పదంగా మరణించడం స్థానికంగా చర్చనీయంశంగా మారింది. అయితే తండ్రి మందలించడం వల్లే వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. అత్యవసర సేవలకు కొత్త నెంబర్ ఇదే
వినీల (17), అఖిల (16) ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. మరో వైపు వినీల ఇటీవల ఓ యువకుడిని ప్రేమించి ఇంటి నుంచి వెళ్లిపోగా.. కులాంతర వివాహం వద్దని చెప్పి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చినట్లు సమాచారం. అప్పటి నుంచి అక్క, చెల్లి ఇద్దరూ తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై బుద్ధిగా చదువుకోకుండా ఇలాంటి పనులు ఏంటని ఆ అక్కాచెల్లెళ్లను తండ్రి మందలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. తండ్రి మందలించడం వల్లే మనస్థాపానికి గురైన ఇద్దరూ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Also Read: సంచలన అప్‌డేట్.. ఇరాన్‌లో భూకంపం రావడానికి కారణం అదే !
ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇద్దరూ కిటికీ రెయిలింగ్‌కి చున్నీతో ఉరి వేసుకున్నారు!. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబానిది ఏపీలోని నెల్లూరు జిల్లా ఉదయగిరిగా చెబుతున్నారు.
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం