Peace Committee : మావోయిస్టుల మృతదేహాలు కుళ్లిపోతున్నాయి..పీస్ కమిటీ సంచలన ఆరోపణ
ఈ నెల 21న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించకపోవడాన్నిపీస్ కమిటీ తప్పు పట్టింది. వాటిని కోల్డ్ స్టోరేజ్ లో భద్ర పర్చకుండా కుళ్లిపోయేలా వదిలేశారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తోందని అభిప్రాయపడింది.