Crypto Fraud : తెలంగాణలో రైతుల పేర్లతో భారీమోసం..రూ.170 కోట్ల క్రిప్టో కరెన్సీ లావాదేవీలు
తెలంగాణలో మరో క్రిప్టో కరెన్సీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రైతులు, వ్యవసాయ కూలీలపేరుతో రూ.170 కోట్లకు పైగా విలువైన మోసపూరిత క్రిప్టో లావాదేవీలు నిర్వహించినట్లు ఇన్కంటాక్స్ అధికారుల విచారణలో తేలింది.