Hyderabad: లవర్తో కలిసి మొగుణ్ని లేపేసింది బండరాయితో.. హైదరాబాద్లో మరో దారుణం!

హైదరాబాద్లో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చిందో ఇల్లాలు.. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో జరిగింది.

New Update
moinabad

హైదరాబాద్లో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చిందో ఇల్లాలు.. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన సామ రాజిరెడ్డి అనే వ్యక్తి రెండు నెలల కిందట డెయిరీ ఫామ్ ఓపెన్ చేశారు. అందులో వర్క్ కోసమని ఓ జంట కావాలని బిహార్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఏజెంట్ పవన్‌‌‌‌ను సంప్రదించాడు. అతని ద్వారా నెల కిందట రాజేశ్ కుమార్, పూనందేవి దంపతులను పనికి కుదుర్చుకున్నాడు రాజిరెడ్డి. అయితే గత గురువారం రాజిరెడ్డి డెయిరీ ఫామ్‌‌కు వెళ్లి చూడగా అక్కడ రాజేశ్‌‌ కుమార్ దంపతులతో పాటుగా మరో వ్యక్తి కనిపించాడు.  దీంతో ఎవరు ఇతనని రాజిరెడ్డి పూనందేవిని నిలదీశాడు.

పుల్ గా తాగి వచ్చి

ఆమె ఇతను తమ బంధువని చెప్పడంతో సరేనని ఊరుకున్నాడు. మళ్లీ శుక్రవారం ఫామ్‌‌కు వెళ్లిన రాజిరెడ్డికి రాజేశ్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్లాడని రాజిరెడ్డి..   పూనందేవిని ప్రశ్నించగా..  పుల్ గా తాగి వచ్చి, నాతో గొడవ పడి ఎక్కడికో వెళ్లాడుని చెప్పింది. అదేరోజు సాయంత్రం ఫామ్ వద్దకు వెళ్లిన రాజిరెడ్డికి పని వాళ్లెవరూ కనిపించలేదు.  దీంతో అనుమానం వచ్చిన రాజిరెడ్డి బిహార్ ఏజెంట్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.  కొద్దిసేపటి తర్వాత అతడు తిరిగి ఫోన్ చేసిన ఏజెంట్ పూనందేవి, మహేశ్​అలియాస్ గుడ్డూ కలిసి రాజేశ్‌‌ను చంపి, బావి వద్ద పడేశారని చెప్పాడు. రాజిరెడ్డి వెళ్లి చూడగా అక్కడ రాజేశ్ కుమార్ డెడ్‌‌బాడీ కనిపించింది.  వెంటనే రాజిరెడ్డి పోలీసులకు సమాచారమివ్వగా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. రాయితో ముఖం, తలపై కొట్టి చంపినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Also Read :   Stray Dogs: కేంద్రం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్

బాలాజీహిల్స్‌లో దారుణం 

కట్టుకున్న భార్యను చంపేసి ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడో భర్త. ఇంత దారుణమైన ఘటన మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీహిల్స్‌లో జరిగింది. బాధితురాలు గర్భవతి కావడం గమనార్హం. భార్యను ముక్కలు ముక్కులుగా నరికేసిన అనంతరం..  ఆమెబాడీ పార్ట్స్ ను  కవర్‌లో ప్యాక్‌ చేసి.. కవర్‌ను బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే రూమ్ నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూడటంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడైన మహేందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. వికారాబాద్‌ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి, మహేందర్‌ ప్రేమవివాహం చేసుకొని బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై స్వాతి తల్లి మీడియాతో మాట్లాడారు. నా కూతుర్ని మాయ చేసి మహేందర్‌ రెడ్డి ఎత్తుకెళ్లిపోయాడు. డిగ్రీ చదువుతున్న తన కూతురికి మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేశాడని, అతని మాయలో పడి తన కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు.. ప్రేమ వివాహం వద్దని చెప్పి తాము వారించామని, అయినప్పటికీ తమ మాట వినకుండా మహేందర్‌ను పెళ్లి చేసుకుందన్నారు. కొన్ని రోజులుగా తన కూతురిని చిత్రహింసలు పెడుతున్నారని చెబుతోంది.. స్వాతి అత్తమామలు, మహేందర్ కలిసి తన కూతురిని చంపారని ఆమె వాపోయింది.  

Advertisment
తాజా కథనాలు