/rtv/media/media_files/2025/01/11/s6aSzdLDSlSiaWSGmGcZ.jpg)
delhi fog
హైదరాబాద్ నగరాన్ని పొగ మంచు కమ్మేసింది. రోడ్లు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగ మంచు వల్ల రోడ్లపై వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. ఇలాంటి సమయాల్లో కూడళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ పరిసరాల్లో పొగ మంచు దట్టంగా కమ్మేసింది.
Also Read: Saif Ali Khan: 15 వేల కోట్ల వారసత్వ సంపద సైఫ్ కు వస్తుందా..లేక చేజారేనా!
నగర పరిధిలోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ తో పాటు నగర శివారులోని పెద్ద అంబర్ పేట్, అబ్ధుల్లాపూర్ మెట్ పరిసరాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.
Also Read: Prabowo Subianto : ఇండియాలో అడుగుపెట్టిన ఇండోనేషియా ప్రెసిడెంట్.. షెడ్యూల్ ఇదే!
హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.సిటీ శివారులో మంచు దుప్పటి కప్పుకుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం. విజయవాడ జాతీయ రహదారిపై పొగమంచు కమ్మేసింది. ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్దఅంబర్ పేట్, అబ్దుల్లాపూర్ మెట్ లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. రన్ వే విజిబులిటీ లేక ఇండిగో విమానం గాల్లో చక్ర్లు కొడుతోంది.
హైదరాబాద్ లో దట్టమైన మంచు కురుస్తుండటంతో వీధులు, రోడ్లు ఢిల్లీని తలపిస్తున్నాయి. పొగ మంచు ప్రభావంతో జనం బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.
Also Read: Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి అల్లు అరవింద్ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా
Also Read: Hyderabad: మహీంద్రా షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం..భారీ ఆస్తి నష్టం!