/rtv/media/media_files/2025/01/24/Lj0qG7N1YEIfreAB5SNM.jpg)
Prabowo Subianto Photograph: ( Prabowo Subianto)
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తన మొదటి భారత పర్యటన నిమిత్తం 2025 జనవరి 24వ తేదీ శుక్రవారం రోజున ఢిల్లీకి చేరుకున్నారు. న్యూఢిల్లీలోని విమానాశ్రయంలో ఆయనకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా గౌరవ స్వాగతం పలికారు. భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రబోవో సుబియాంటో చీఫ్ గెస్టుగా హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన భారత్-ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
A warm welcome to President Prabowo Subianto @prabowo of Indonesia as he arrives in New Delhi on his first State Visit to India. Received by MoS @PmargheritaBJP at the airport.
— Randhir Jaiswal (@MEAIndia) January 23, 2025
President @prabowo will be the Chief Guest for 🇮🇳's 76th Republic Day celebrations.
This visit will… pic.twitter.com/OEeXLOengC
ఇండియాకు బయలుదేరే ముందు, అధ్యక్షుడు ప్రబోవో తన పర్యటన వివరాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు భద్రత, సముద్రయానం, డిజిటల్ టెక్నాలజీ అభివృద్ధి వంటి రంగాలలో వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడం ఈ పర్యటన లక్ష్యం అని తన ట్వీట్ లో చెప్పుకొచ్చారు. ఇండోనేషియా పర్యటన అనంతరం మలేషియాకు బయల్దేరి వెళ్లనున్నట్లు తెలిపారు.
ప్రబోవో సుబియాంటో షెడ్యూల్ ఇదే
తన పర్యటనలో సుబియాంటో ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అధ్యక్షుడు ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్‌లతో సమావేశమవుతారు. శుక్రవారం సాయంత్రం 4:00 గంటలకు తాజ్‌మహల్ హోటల్‌లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ కానున్నారు.
జనవరి 25న ప్రబోవో ఉదయం 10:00 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఉత్సవ రిసెప్షన్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు, ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య అనేక అవగాహన ఒప్పందాలు, ఎంఓయూలు జరగనున్నాయి. సాయంత్రం 4:00 గంటలకు తాజ్ మహల్ హోటల్‌లో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌తో సమావేశమవుతారు. రాత్రి 7:00 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవుతారు.
జనవరి 26న గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ప్రబోవో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మధ్యాహ్నం తర్వాత రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ముర్ము ఏర్పాటు చేయనున్న ఎట్ హోమ్ రిసెప్షన్‌లో పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటలకు ఆయన తిరిగి ఇండోనేషియాకు బయలుదేరి వెళతారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకానున్న నాల్గవ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రెసిడెంట్ ప్రబోవో కావడం విశేషం. ఇక ప్రధాని నరేంద్ర మోదీ 2018లో ఇండోనేషియాకు అధికారిక పర్యటనకు వెళ్లారు. గత ఏడాది నవంబర్‌లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన జి20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు ప్రబోవోను కలిశారు.