Allu Aravind: వావ్! అమ్మాయితో కలిసి అల్లు అరవింద్‌ భలే డాన్స్ వేశారు! వీడియో చూశారా

తండేల్ 'హైలెస్సో.. హైలస్సా' రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ డాన్స్ వైరల్ గా మారింది. స్టేజ్ పై సింగర్స్ తో కలిసి 'హైలెస్సో' పాటకు స్టెప్పులేశారు. తండేల్ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

New Update

 Allu Aravind: అక్కినేని నాగచైతన్య- సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'తండేల్'. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. తండేల్ ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా తాజాగా మూవీ నుంచి  ‘హైలెస్సో.. హైలస్సా' లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. 

ఈవెంట్ లో అల్లు అరవింద్ డాన్స్ 

అయితే ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అల్లు అరవింద్ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్టేజ్ పై డాన్సర్స్ తో కలిసి అల్లు అరవింద్ 'హైలెస్సో' పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

తండేల్ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీత ఆర్ట్స్ పతాకం పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మత్స్య కారుల కథనంతో.. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్న ఈ చిత్రంలో... జాలరి రాజు పాత్రలో నాగచైతన్య , సత్య పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

Also Read: Mythri Movie Makers: పుష్ప2 కు బిగ్ షాక్.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు

Advertisment
తాజా కథనాలు