Telangana: హమ్మయ్య చలి కాస్త తగ్గింది..పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి కాస్త తగ్గుముఖం పట్టింది.హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో చలి కాస్త తగ్గుముఖం పట్టింది.హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదిలాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్‌కే టెంపరేచర్లు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
మంచు దుప్పటిలో నుంచి ఢిల్లీ బయటకు రావడం లేదు. రోజురోజుకూ ఇక్కడ పొగమంచు ఎక్కువ అవుతోంది. దీని కారణంగా ఈరోజు ఢిల్లీ నుంచి బయలుదేరే ఆరు విమానాలు క్యాన్సిల్ చేశారు. మరో వంద ఫ్లైట్స్ ఆలస్యంగా బయలుదేరుతున్నాయి.
పొగమంచు దేశంలో మిగతా ప్రాంతాలతో పాటూ హైదరాబాద్‌ను కూడా కమ్మేసింది. దీంతో ఇక్కడ కూడా విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విమానాలు ఫ్లై అవ్వడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో చాలా విమానాలు రద్దు అవుతున్నాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
పొగమంచు వల్ల ఢిల్లీ, ముంబై ఫ్లైట్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో గంటల కొద్దీ ప్రయాణికులు విమనాల్లో, ఎయిర్ పోర్ట్‌లలో చిక్కుపోయారు. దీంతో ప్రయాణికులు చాలా అసహనానికి గురవుతున్నారు. తాజాగా విమానం పక్కన కూర్చుని ప్రయాణికులు భోజనాలు చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి బుకింగ్ లను రీ షెడ్యూల్ చేసేందుకు లేక రద్దు చేయడానికి అనుమతి ఇస్తున్నట్లు టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బుధవారం నాడు ప్రకటించింది.
రెండు తెలుగు రాష్ట్రాలను పొగమంచు కమ్మేస్తుంది. శంషాబాద్ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేయడంతో 35 విమానాలను దారి మళ్లించారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు విమానాలను విమానాశ్రయంలోనే నిలిపివేశారు.
దేవనహళ్లి సమీపంలోని ఎయిర్ పోర్టు రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్కజాల ఫ్లైఓవర్ పై ఎనిమిది కార్లు ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలకు ఎలాంటి హాని జరగలేదు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.