Saif Ali Khan: 15 వేల కోట్ల వారసత్వ సంపద సైఫ్‌ కు వస్తుందా..లేక చేజారేనా!

సైఫ్‌ అలీఖాన్‌ రూ. 15 వేల కోట్ల ఆస్తుల విషయంలో న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి.సైఫ్‌ ఫ్యామిలీకి పూర్వ పాలకుల నుంచి సుమారు రూ.15 వేల కోట్ల ఆస్తులు వచ్చాయి.ఇప్పుడు వాటి యాజమాన్య హక్కుల పై సందిగ్ధత నెలకొంది.

New Update
saif ali khan

saif ali khan

ఇప్పుడిప్పుడే కత్తిదాడి నుంచి కోలుకున్న బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కు ఇప్పుడు రూ. 15 వేల కోట్ల ఆస్తుల విషయంలో న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. పటౌడీ నవాబుల వంశానికి చెందిన సైఫ్‌ కుటుంబానికి భోపాల్ పూర్వ పాలకుల నుంచి  సుమారు రూ.15 వేల కోట్ల ఆస్తులు వారసత్వంగా వచ్చాయి.

Also Read: Musk-Pakisthan: మస్క్‌ క్షమాపణలు చెప్పాల్సిందే!

ఇప్పుడు వాటి యాజమాన్య హక్కుల పై సందిగ్ధత నెలకొంది. ఆ ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్‌ పరిధలోకి రావంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్య ప్రదేశ్‌ హైకోర్టు గత డిసెంబర్ 13న రద్దు చేసింది. ఈ నేపథ్యంలో వాటిని కాందిశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియన్‌ ఆఫ్‌ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది.దీన్ని సవాలు చేస్తూ సైఫ్ కుటుంబం పిటిషన్ దాఖలు చేసిందా లేదా అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు.

Also Read: Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌ లో ఆగని మిస్టరీ మరణాలు..200 మంది క్వారంటైన్‌ కేంద్రాలకు!

ఒకవేళ వారు ఆ ఉత్తర్వులను సవాలు చేయకపోతే ఆ ఆస్తులు కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయని వెల్లడించారు. 

అసలు విషయం ఏంటంటే... భోపాల్‌ లో సైఫ్‌ కుటుంబానికి అతడి నాన్నమ్మ సాజిదా సుల్తాన్‌ నుంచి పలు విలాసవంతమైన భవంతులు వారసత్వంగా వచ్చాయి. భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్‌ కుమార్తె సాజిదా. ఆయన పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్‌ దేశ విభజన నేపథ్యంలో పాకిస్థాన్‌ కు 1950 లో వలస వెళ్లారు. 

కాందిశీకుల ఆస్తులుగా..

సాజిదా ఇక్కడే నివసిస్తూ పటౌడీ నవాబు అయిన ఇఫ్తిఖర్‌ అలీఖాన్‌ ను వివాహమాడారు. సాజిదాకు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కాలక్రమంలో ఆమె వారసులైన సైఫ్‌ కుటుంబానికి దక్కాయి. అయితే హమీదుల్లాకు చట్టబద్ధ వారసురాలు అబీదా మాత్రమే అని, ఆమె పాక్‌ కు వలస వెళ్లినందువల్ల ఎనిమీ యాక్ట్‌ ప్రకారం ఆ ఆస్తులను కాందిశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్‌ ఆఫ్‌ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2015లో ప్రకటించింది.

దీన్ని సవాలు చేస్తూ సైఫ్‌ తల్లి,ప్రముఖ నటి షర్మిలా ఠాగోర్‌ మధ్య ప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 2019 లో సాజిదాను కూడా వారసురాలిగా గుర్తిస్తున్టన్లు ఉత్తర్వులు రావడంతో సైఫ్‌ కుటుంబానికి ఊరట దక్కింది. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన ఆదేశాలు రావడంతో వారి కుటుంబ న్యాయపోరాటం కొనసాగిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

Also Read: Greenpeace: దావోస్‌లో సంపన్నుల ప్రైవేటు జెట్‌లు స్వాధీనం.. పర్యావరణ ప్రేమికుల వినూత్న నిరసన

Also Read:  Mumbai Cricket Association: ముంబయి క్రికెట్ అసోసియేషన్ గిన్నిస్ రికార్డు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు