Hyderabad: మహీంద్రా షోరూమ్‌ లో భారీ అగ్ని ప్రమాదం..భారీ ఆస్తి నష్టం!

హైదరాబాద్ లోని మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కార్ల షోరూంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షోరూం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది.

New Update
mahindra

mahindra

హైదరాబాద్ లోని మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కార్ల షోరూంలో గురువారం రాత్రి  భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షోరూం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజిన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసారు. 

Also Read: Saif Ali Khan: 15 వేల కోట్ల వారసత్వ సంపద సైఫ్‌ కు వస్తుందా..లేక చేజారేనా!

షోరూంలో పనిచేసే ఉద్యోగులు విధులు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం సంభవించడం వల్ల ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది. షోరూమ్ లో 30కి పైగా కార్లు ఉన్నాయని అక్కడ పనిచేసే సిబ్బంది చెప్పారు. అవన్నీ మంటలకు ఆహుతి అయిపోయాని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన కారణంగా ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.అగ్నిమాపక సిబ్బంది షో రూమ్ పక్కనే ఉన్న సహస్ర్ ఉడిపి గ్రాండ్ హోటల్‌, పైన ఉన్న ఓయో రూమ్స్ కు మంటలు అంటుకోకుండా తక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. 

Also Read: Prabowo Subianto : ఇండియాలో అడుగుపెట్టిన ఇండోనేషియా ప్రెసిడెంట్.. షెడ్యూల్ ఇదే!

అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. షోరూంలో నష్టం ఎంతవరకు జరిగిందనే విషయమై అధికారులు విచారణ జరుపుతున్నారు. అక్కడ పరిస్థితి చూస్తే మాత్రం భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదం వల్ల ఏర్పడిన ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇంకా సంబంధిత అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

Also Read: Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌ లో ఆగని మిస్టరీ మరణాలు..200 మంది క్వారంటైన్‌ కేంద్రాలకు!

Also Read: Greenpeace: దావోస్‌లో సంపన్నుల ప్రైవేటు జెట్‌లు స్వాధీనం.. పర్యావరణ ప్రేమికుల వినూత్న నిరసన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు