Telangana Weather Report: అగ్నిగుండంలా తెలంగాణ.. రాష్ట్రంలో మాడు పగిలే ఎండలు..!

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భీకరమైన ఎండలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నేడు కూడా పలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

New Update
Heat Alert: దేశంలోని పలు ప్రాంతాల్లో 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..రెడ్‌ అలర్ట్ జారీ!

Heat Waves :

Telangana Weather Report: తెలంగాణ అగ్నిగుండంలా మారింది. మాడు పగిలే ఎండలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. భానుడి భగభలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జనవరి చివరి వారం నుంచే భానుడి బ్యాటింగ్ మామూలుగా లేదు. మార్చి తొలి వారం నుంచి అయితే సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మధ్యలో ఓ వారం పాటు వర్షాలు కురిసి వాతావరణం చల్లబడినా.. మళ్లీ సూర్యుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి.

Also Read:  Devara Japan Collections: జపాన్​లో దేవర 'ఫెయిల్'..!! అందరి ముందు పరువు పోయిందిగా..

శనివారం ఆదిలాబాద్ జిల్లాలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో భానుడు ఉగ్రరూపం చూపించాడు. ఆయా జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. రేపట్నుంచి భానుడి ప్రతాపం మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. మరో రెండు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

Also Read: TG News: మందుబాబులకు ఉగాది గిఫ్ట్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

వడగాలులు వీచే ఛాన్స్

కుమురంభీం-ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జోగులాంబ-గద్వాల, నారాయణపేట, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. వడగాలులు వీచే ఛాన్స్ ఉందని.. వడ దెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. తీవ్ర ఎండలు, ఊపిరాడకుండా చేసే ఉక్కపోతతో ఇప్పటికే ప్రజలు అల్లాడిపోతున్నారని రానున్న రోజుల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

అయితే ఏఫ్రిల్ 2 నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఏఫ్రిల్ 2, 3 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు.

Also Read: Transgenders: డబ్బులు అడిగితే ఇవ్వలేదని.. ట్రైన్‌లో యువకుడిని తొక్కి చంపిన హిజ్రాలు

Also Read: Hyderabad: మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్యహత్య కేసులో కొత్త మలుపు..భర్త వల్లనే..

heat | heat-waves | latest-news | latest-telugu-news | latest telugu news updates | khammam | Mahabub Nagar | nalgonda | suryapet

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు