/rtv/media/media_files/2025/03/30/YLxbhwgh79gOhwE4c6Lf.jpg)
Telangana Government approves more 41 new bars and restaurants
TG News: ఈ మేరకు కొత్త బార్లకు ఉగాది రోజే (మార్చి 30) నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్త 41లో గ్రేటర్ హైదరాబాద్ 16 మినహాయిస్తే రాష్ట్రంలో 25 కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్కు అనుమతి ఇచ్చింది. ఒక్కో బార్ కోసం లక్ష రూపాయల ధరఖాస్తు ఫీజును కేటాయించింది. ఒక్కో బారుకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లక్కీ డ్రా కేటాయించనుంది. ఏప్రిల్ 26 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అబ్కారీ శాఖ స్పష్టం చేసింది. అయితే వేలంపాట లక్ష రూపాయలు తిరిగి ఇవ్వబడవని ఎక్సైజ్ శాఖ తెలిపింది.
ప్రస్తుతం 1171 బార్లు, 2620 వైన్స్ లు..
రాష్ట్రంలో ప్రస్తుతం 1171 బార్లు, 2620 వైన్స్ ఉన్నాయి. కాగా ఇప్పటికే ఉన్న బార్లు నష్టాల్లో ఉన్నాయని, అలాంటప్పుడు మళ్లీ కొత్తగా బార్ల ఏర్పాటు ఎందుకని బార్ అండ్ రెస్టారెంట్స్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో 2017 జనవరిలో ఆగిపోయిన టెండర్లనే కొత్తగా పిలుస్తున్నామని ఎక్సైజ్ శాఖ వివరణ ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి లిక్కర్ ఆదాయం అమాంతం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. కనీసం నెలకు రూ. 4,500 కోట్లు ఎక్సైజ్ శాఖకు ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తోంది.
6 నెలల్లో రూ.17,533 కోట్ల రాబడి..
2024 ఏప్రిల్, సెప్టెంబర్ కాలంలో ఎక్సైజ్ శాఖకు ఎక్సైజ్‌డ్యూటీ ద్వారా రూ.9,493 కోట్లు, వ్యాట్‌రూ.8,040 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొదటి 6 నెలల్లో రూ.17,533 కోట్ల రాబడి వచ్చింది. డిసెంబరులో కొనుగోళ్లు ఊపందుకోగా ఆదాయం పెరిగింది. 2024–25లో మద్యం అమ్మకాల వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల ద్వారా రూ.36 వేల కోట్ల ఆదాయం రావొచ్చని రేవంత్ సర్కారు భావిస్తోంది.
Also Read: Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!
రాష్ట్రవ్యాప్తంగా రోజుకు మద్యం ద్వారా రూ.90 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. నెలకు సగటున రూ.2,700 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. బీర్ల రేట్లు పెరగడంతో ప్రతినెలా రూ.300 కోట్ల వరకు ఆదాయం అదనంగా వస్తుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
bars | wines | telangana | cm revanth
Follow Us