/rtv/media/media_files/2025/03/29/PRA78tBGdtIf7nlIpCGu.jpg)
pinky
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ అత్తాపూర్ లో పెను విషాదం చోటు చేసుకుంది.నగరంలో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఇంట్లో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారంతో అత్తాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. తర్వాత ఈ కేసులో కీలక ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఆమె భర్త అమిత్ లోయాను అదుపులోకి తీసుకున్నారు.
డబ్బు పోయింది, భర్తతో గొడవ..
పోలీసులు కథనం ప్రకారం పింకీ ఆమె భర్త అమిత్ లోహియా వల్లనే ఆత్యహత్య చేసుకుంది. పింకీ సంపాదించిన డబ్బులు స్టాక్ మార్కెట్లో పెట్టి...వాటిని పోగొట్టుకోవడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. పింకీ సంపాదించిన రూ.7 లక్షలను తీసుకుని అమిత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. వాటి ద్వారా రూ.20 లక్షలు సంపాదించాడు. ఆ తరువాత వాటిని కూడా అమిత్ స్టాక్ మార్కెట్లో పెట్టేశాడు. అయితే ఈసారి మాత్రం అతను మొత్తం పోగొట్టేసుకున్నాడు. దీనిపై పీంకీకి, ఆమె భర్తకు మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా పెరిగి పెద్దైంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె సూసైడ్ చేసుకుంది.
పింకీ, అమిత్ లు గతేడాది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ ఇయర్ సెప్టెంబర్ కల్లా బాగా డబ్బులు సంపాదించి అందరి సమక్షంలో మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. అయితే అమిత్ ఆర్థిక నిర్ణయాలు వారి ప్లాన్ లనన్నింటినీ చెల్లాచెదురు చేసేశాయి. దీనిని పింకీ తట్టుకోలేకపోయింది. అందుకే చివరిసారిగా ఆమె తన భర్తకు కాల్ చేసి మరీ ఆత్యహత్య చేసుకుంది. పోలీసులు అమిత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.
today-latest-news-in-telugu | mehandi | artist
Also Read: Mynmar: తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు..మయన్మార్ లో మృత్యుఘోష