BIG BREAKING: ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామా

ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనారోగ్య కారాణాలతో ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ధన్‌ఖడ్‌ తెలిపారు. ఈమేరకు ఆయన సోమవారం రాష్ట్రపతికి రాజీనామ లేఖ పంపారు.

New Update
Vice President Jagdeep Dhankhar

Jagdeep Dhankhar resigns

ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనారోగ్య కారాణాలతో ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ధన్‌ఖడ్‌ తెలిపారు. ఈమేరకు ఆయన సోమవారం రాష్ట్రపతికి రాజీనామ లేఖ పంపారు. జగ్‌దీప్ ధన్‌ఖడ్ 2022 జులై 16న ఉపరాష్ట్రపతిగా ఎన్నికైయ్యారు. లెక్కప్రకారం.. 2027లో ఆయన పదవి కాలం ముగియనుంది. చివరిగా ఆయనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధాని, రాష్ట్రపతికి కృతజ్ఞతలు చెప్పారు.

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే రాజ్యసభ్య ఛెర్మన్ రాజీనామా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదో బలమైన కారణంతోనే ఆయన పదవికి రాజీనామా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

1989 నుంచి 1991 వరకు 9వ లోక్‌సభలో జనతాదళ్ సభ్యుడిగా రాజస్థాన్‌లోని ఝుంఝును లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1991లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి 1991 భారత సార్వత్రిక ఎన్నికల్లో అజ్మీర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత ఆయన రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1993 నుండి 1998 వరకు రాజస్థాన్ 10వ శాసనసభలో పనిచేశారు. జగ్‌దీప్ ధన్‌ఖడ్ 1998 భారత సార్వత్రిక ఎన్నికల్లో ఝుంఝును లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి, మూడవ స్థానంలో నిలిచాడు. ఆయన 2003లో బిజెపిలో చేరారు. 2008 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ప్రచార కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆయన 2019–2022 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్ ‌గా కూడా సేవలందించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు