/rtv/media/media_files/2025/10/31/tesla-and-starlink-2025-10-31-18-31-46.jpg)
Jobs for Indians in Elon Musk’s Starlink, hiring begins in India
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గుడ్‌న్యూస్ అందించారు. ఆయనకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, అలాగే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించే స్టార్‌లింక్ భారత్‌లో ఉద్యోగ నియామకాలను ప్రారంభించాయి. ఢిల్లీ, ముంబయి, పుణెలో పనిచేసేందుకు టెస్లా ప్రకటన ఇచ్చింది. త్వరలో వాణిజ్య సేవలు అందించేందుకు రెడీ అవుతున్న స్టార్‌లింక్ కూడా బెంగళూరు కేంద్రంగా పనిచేయడం కోసం ఉద్యోగ నియామకాలు ప్రారంభించింది.
Also read: భారత్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ఇండియన్ నేవీ పాక్, చైనాలకు చెక్
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది దేశీయంగా మోడల్ వై పేరుతో విక్రయాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే తాజాగా 34 మంది ఉద్యోగులను నియమించుకునేందుకు ఓ ప్రకటన ఇచ్చింది. వీళ్లందరూ ముంబయి, పుణె, ఢిల్లీలో పనిచేయాలి.
సప్లై చైన్, రోబోటిక్స్, వెహికల్ సర్వీసెస్, ఆపరేషన్స్ అండ్ బిజినెస్ సపోర్ట్, ఇంజినీరింగ్& ఐటీ, సేల్స్, కస్టమర్ సపోర్ట్, ఏఐ, ఛార్జింగ్, హెచ్‌ఆర్ విభాగాల్లో నియామకాలు చేపట్టనుంది. టెస్లా కెరీర్స్ లేదా ఇతర జాబ్ పోర్టళ్ల ద్వారా ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత వివిధ దశల్లో ఫిల్టర్ చేసి ఇంటర్వ్యూలూ నిర్వహించి నియామకాలు చేపట్టనున్నారు.
Also Read: ఆశపెట్టి.. తిరిగి లాగేసుకుంటున్నారు..జేడీ వాన్స్ పై తిరగబడ్డ భారత మహిళ
మరోవైపు స్టార్‌లింక్ కూడా తక్కువ లేటెన్సీ కలిగిన బ్రాడ్‌బ్యాండ్ సేవలు తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తొలిదశ నియామక ప్రక్రియలో భాగంగా ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతోంది. పేమెంట్ మేనేజర్, సీనియర్ ట్రెజరీ అసిస్ట్, అకౌంటింగ్ మేనేజర్, ట్యాక్స్ మేనేజర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అయితే వీళ్లందరూ కూడా బెంగళూరు కేంద్రంగా పనిచేయాలి. అంతేకాదు స్టార్‌లింక్ ఎర్త్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం నుంచి పర్మిషన్ వస్తే ఈ ఏడాది ఆఖర్లో లేదా 2026 ప్రారంభంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకుంది.
Follow Us