/rtv/media/media_files/2025/10/02/telangana-medchal-wife-killed-husband-in-indira-nagar-colony-2025-10-02-12-16-36.jpg)
telangana medchal Wife Killed Husband in Indira Nagar Colony
గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ కలహాలు, మద్యం కారణంగా విపరీతంగా హత్యలు, ఆత్మహత్యల ఘటనలు జరుగుతున్నాయి. ఇవి ప్రజల్లో మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇటీవల నల్గొండ/సూర్యాపేట పరిసర ప్రాంతంలో కూడా ఇలాంటి తరహాలోనే భర్త వేధింపులు భరించలేక భార్య హతమార్చి(wife-killed-husband)న సంఘటన వెలుగులోకి వచ్చాయి. ఈ కోవలోనే తాజాగా మేడ్చల్ పట్టణంలో జరిగిన మరో ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : లైవ్ వీడియో.. రూ.6 లక్షల నెక్లెస్‌ను క్షణాల్లో కొట్టేసిన మహిళ
తాగొచ్చిన భర్తను లేపేసిన భార్య
మేడ్చల్ పట్టణం, ఇంద్రానగర్ కాలనీలో శ్రీనివాస్ (45), సావిత్రి దంపతులు నివసిస్తున్నారు. శ్రీనివాస్ భవన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదే సమయంలో అతడు మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి భార్య సావిత్రిని వేధింపులకు గురిచేశాడు. ఆమె చాలా సార్లు చెప్పి చూసింది. కానీ అతడు ఎప్పటికీ మారలేదు. ఇందులో భాగంగానే బుధవారం మరోసారి అతడు తన భార్యతో గొడవపడ్డాడు.
దీంతో ఆమె భరించలేక అతడిని హతమార్చింది. క్షణకావేశంలో కర్రతో అతడిపై దాడి చేసింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, శ్రీనివాస్ మద్యం మత్తులో ఉన్న సమయంలోనే ఈ ఘాతుకం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
హత్య అనంతరం భార్య తన అంగీకరించింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో నిందితురాలు సావిత్రపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read : కాకినాడలో కలకలం రేపుతున్న లవ్ కపుల్ డెత్! రైలు పట్టాలపై లవర్ దారుణం
ఇలాంటిదే మరో ఘటన
నల్గొండ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ.. మరొకరి సహాయంతో తన భర్తకు మద్యం తాగించి, ఆ తర్వాత దాడి చేసి హతమార్చింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసుల దర్యాప్తులో హత్య అని తేలింది.
రాజస్థాన్ / జార్ఖండ్‌లలోనూ.. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. రాజస్థాన్‌లో తాగుబోతైన సహజీవన భాగస్వామిని చంపి, మృతదేహంతో రోజంతా ఇంట్లోనే ఉన్న మహిళ ఘటన సంచలనం సృష్టించింది.
ఈ హత్యల్లో చాలా వరకు నిందితులు భర్త మద్యం మత్తులో ఉన్నప్పుడు లేదా నిద్రిస్తున్న సమయంలో హత్యకు పాల్పడటం, ఆ తర్వాత దానిని ఆత్మహత్యగా లేదా సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించడం గమనార్హం. కుటుంబాల్లోని తీవ్రమైన ఒత్తిడి, సంఘర్షణలు ఇలాంటి నేరాలకు కారణమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.