Woman Steals Gold Necklace: లైవ్ వీడియో.. రూ.6 లక్షల నెక్లెస్‌ను క్షణాల్లో కొట్టేసిన మహిళ

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నగల దుకాణంలో, దంపతులు కస్టమర్లుగా నటించి రూ. 6 లక్షల విలువైన బంగారు నెక్లెస్‌ను చాకచక్యంగా దొంగిలించారు. సిబ్బంది చూస్తుండగానే మహిళ తన చీరలో నెక్లెస్‌ను దాచిపెట్టింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు.

New Update
UP Woman Rs 6 Lakh Steals Gold Necklace

UP Woman Rs 6 Lakh Steals Gold Necklace

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో కళ్లు బైర్లుగమ్మే దొంగతనం జరిగింది. ఓ నగల దుకాణంలో దంపతులు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. షాపు సిబ్బందికి ఏమాత్రం అనుమానం రాకుండా.. వారి కళ్ల ముందే ఏకంగా రూ. 6 లక్షల విలువైన బంగారు నెక్లెస్‌ను చోరీ చేశారు. సిబ్బంది వారికి మరిన్ని ఆభరణాలు చూపిస్తూ బిజీగా ఉన్న సమయంలోనే ఈ దొంగతనం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

UP Woman Steals Gold Necklace 

ఒక మహిళ తన భర్తతో కలిసి నగల షాపుకు వెళ్లింది. అక్కడ దంపతులు కస్టమర్లుగా దుకాణంలోకి అడుగుపెట్టి తమకు నచ్చిన నగలను సిబ్బందికి చూపించమన్నారు. అదే సమయంలో వారి చేతి వాటం ప్రదర్శించారు. మొదట ఆ దంపతులు బంగారు నెక్లెస్‌లను చూస్తున్నట్టు నటించారు. అలా కొద్ది నిమిషాల్లోనే ఆ మహిళ చాలా చాకచక్యంగా ఒక నెక్లెస్‌ను తన ఒడిలో పెట్టుకుంది. ఆ తర్వాత మరికొన్ని నెక్లెస్‌లను చూస్తున్నట్లు సిబ్బందిని నమ్మించారు. 

అదే సమయంలో ఒక నెక్లెస్‌ను తిరిగి టేబుల్‌పై పెట్టి, దొంగిలించాలనుకున్న నెక్లెస్‌ను తన చీర కొంగుతో కప్పేసింది. అలా ఇంకా మరిన్ని నెక్లెస్‌లను చూస్తున్నట్టు నటిస్తూనే, ఆమె సీక్రెట్‌గా దొంగిలించిన నెక్లెస్‌ను తన చేతి కింద దాచుకుంది. ఈలోగా ఆమె భర్త సేల్స్‌మెన్‌తో నగల ధరల గురించి మాట్లాడుతూ సిబ్బంది దృష్టిని మళ్ళించాడు. కొంత సమయం గడిచాక వారికి ఏ నగలూ నచ్చలేదని చెప్పి ఆ దంపతులు మెల్లగా దుకాణం నుండి వెళ్లిపోయారు.

తరువాత దుకాణం యజమాని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, దొంగతనం విజువల్స్ స్పష్టంగా కనిపించింది. ఆ దృశ్యాల్లో దంపతులు బంగారు నెక్లెస్‌లను చూస్తున్నట్టు నటించారు. కొద్ది నిమిషాల్లోనే ఆ మహిళ చాలా చాకచక్యంగా ఒక నెక్లెస్‌ను తన ఒడిలో పెట్టుకుని, మరొకటి తీసుకుంది. ఆ తర్వాత ఒక నెక్లెస్‌ను తిరిగి టేబుల్‌పై పెట్టి, దొంగిలించాలనుకున్న నెక్లెస్‌ను తన చీర కొంగుతో కప్పివేసింది. చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగతనానికి పాల్పడిన దంపతుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బహిరంగంగా పగటిపూట ఇంత తెలివిగా దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపింది.

Advertisment
తాజా కథనాలు