/rtv/media/media_files/2025/10/01/kakinada-lovers-incident-2025-10-01-15-40-57.jpg)
Kakinada Lovers Incident
Love Couple Death: కాకినాడ(kakinada) జిల్లాలో యువతీ, యువకుడి అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటన సామర్లకోట మండలం పనసపాడులో వెలుగు చూసింది. యువతి మృతదేహం పనసపాడు శివారులోని ఆలయం వద్ద లభ్యమవగా.. ఆమె ఒంటిపై గాయాలు, కత్తిపోట్లతో మృతి చెంది ఉంది. యువకుడి మృతదేహాం హుస్సేన్‌పురం రైల్వే ట్రాక్ దగ్గర లభ్యమైంది. మృతులను గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన దీప్తి, అశోక్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలంలో ఆధారాల, క్లూస్ ను సేకరిస్తున్నారు.
ప్రేమ వ్యవహారమా?
ఒకే గ్రామానికి చెందిన వీరిద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు ఇది ఆత్మహత్యా లేదా ఎవరైనా వీరిద్దరిని హత్య చేసి వేరువేరు చోట్ల పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మరోవైపు మృతుడు ఆశోక్ పై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా అశోక్ ప్రియురాలు దీప్తి గొంతుకోసి.. ఆ తర్వాత తాను రైలు పట్టాల కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో కూడా విచారిస్తున్నారు పోలీసులు. దీప్తి స్థానికంగా ఉన్న కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా... అశోక్ చెన్నై లో ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
దీప్తి పెదనాన్న మాట్లాడుతూ..
ఈ సంఘటన గురించి దీప్తి పెదనాన్న మాట్లాడుతూ.. మంగళవారం రోజు దీప్తి సెలవుల కోసం దుర్గాడ గ్రామంలోని తమ ఇంటికి వచ్చిందని తెలిపారు. కాగా, ఆరోజు మధ్యాహ్నం దీప్తి, తన కూతురు ఇద్దరూ కలిసి షాపింగ్ కి వెళ్ళొస్తామని చెప్పి బయటకు వెళ్లారని.. షాపింగ్ అనంతరం దీప్తి ఒక ఫ్రెండ్ ని కలవాలని చెప్పి.. తన కూతురిని ఇంటికి పంపించేసిందని చెప్పారు.
అలా వెళ్లిన దీప్తి రాత్రి అయినా సరే ఇంకా ఇంటికి రాకపోవడంతో.. కంగారుగా మా తమ్ముడికి ఫోన్ చేశాను. ఫ్రెండ్స్ ఇంటికి లేదా ఏదైనా సినిమాకు వెళ్ళిందేమో అనుకున్నాం. కానీ, మరునాడు ఉదయం సామర్లకోట ఎస్ఐ ఫోన్ చేసి.. దీప్తి చనిపోయిన విషయం గురించి చెప్పారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే చనిపోయిన రోజు దీప్తి.. అశోక్ ని కలిసినట్లు తెలిసిందని ఆమె పెదనాన్న తెలిపారు. దీంతో అశోక్ పై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి దీప్తి అతడిని కలిసిన సమయంలో ఏదైనా గొడవ జరిగి కోపంలో ఆమెను గొంతు కోసి చంపేసి .. తానూ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైనా వీరిద్దరిని హత్య చేశారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Also Read: Bigg Boss Telugu Promo: గేమ్ ఛేంజర్ పవన్.. సుమన్ శెట్టి VS రీతూ నామినేషన్స్ లో రచ్చ రంబోలా!