Telangana: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: భట్టి విక్రమార్క

తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. రూ.20 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ.. లక్ష్యానికి మంచి రూ.21 వేల కోట్లు అందించామని తెలిపారు.

New Update
Batti Vikramarka

Batti Vikramarka

తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. హైదరాబాద్‌లో మహిళల భద్రతను పెంచడమే లక్ష్యంగా.. హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో (HCSC) కలిసి నగర పోలీసులు మంగళవారం నిర్వహించిన ‘స్త్రీ’(షీ ట్రంప్స్‌ థ్రూ రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్‌ ఎంపవర్‌మెంట్‌) సమ్మిట్‌కు భట్టి విక్రమార్క హాజరయ్యారు. 

Also Read: మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

Telangana Government Says Women Crorepatis

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. '' స్త్రీలకు సమాన హక్కులు అందించి, రాజ్యాంగానికి రూపమిచ్చిన అంబేద్కర్ జయంతి మరుసటి రోజే ఈ సదస్సు జరుపుకుంటున్నాం. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అన్ని రకాల సాధికారిత కల్పించాలనే టార్గెట్‌తో పనిచేస్తున్నాం. మహిళా సంఘాలకు ప్రభుత్వం ప్రతీ సంవత్సరం రూ.20 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ లక్ష్యానికి మంచి రూ.21 వేల కోట్లు అందించాం. గ్రీన్‌ ఎనర్జీలో భాగంగా మహిళల్ని భాగస్వాములను చేస్తున్నాం. సోలార్ రంగంలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి మహిళా సంఘాలతో అవగాహన ఒప్పందం చేసుకున్నాం. 

Also Read: కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?

మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తయారు చేయడంతో పాటు వాటిని అమలు చేస్తే మహిళ సాధికారత సాధ్యం అవుతుంది.దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని'' భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఇంకా నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. 2024లో హైదరాబాద్‌లో 250 రేప్ కేసులు, 713 పోక్సో కేసులు నమోదయ్యాయి. మహిళలకు న్యాయం అందించేందుకు షీ టీమ్స్‌తో పాటు భరోసా కేంద్రం పనిచేస్తోందని తెలిపారు. 

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

Also Read :  మీ అంతట మీరే వెళ్ళిపోండి.. మేము ఖర్చులు భరిస్తాం.. ట్రంప్ ఆఫర్

 

batti-vikramarka | rtv-news | telugu-news | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | latest telangana news | telangana news today | telangana news live updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు