/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-02T193217.448.jpg)
మనదేశంలో టోల్ విధానంలో భారీగా మార్పులు రానున్నాయి. కొత్త టోల్ చెల్లింపు విధానాలను ఇప్పటికే మూడు చోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేయగా.. సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ టోల్ పాలసీలో హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణిస్తే సగటున 50 శాతం వరకు టోల్ రుసుము తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. మరో 15 రోజుల్లో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు అమలు చేయనున్నట్లు కేంద్ర రోడ్డు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రానున్న కాలంలో జీపీఎస్ ఆధారిత విధానాన్ని అమలు ద్వారా టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించటంతో పాటు ఆలస్యాన్ని తగ్గించాలని రవాణా శాఖ నిర్ణయించింది.
Also read: Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 వల్ల లాభాలు ఇవే..
ప్రస్తుతం నెలవారీ పాస్‌లు మాత్రమే జారీ చేస్తుండగా కొత్త పాలసీ కింద ఏడాదికి పాస్ లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే కొత్త టోల్ విధానంలో ఈయల్సీ పాసులను తీసుకురానున్నారు. సంవత్సరానికి రూ.3వేల టోల్ పాస్ అందించాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ పాసులు అన్ని నేషనల్ హైవేలతో పాటు రాష్ట్రాల ఆధీనంలో ఉండే ఎక్స్‌ప్రెస్‌వేలపై కూడా చెల్లుబాటు అవుతాయని తెలుస్తోంది. అలాగే టోల్ చెల్లింపు రుసుము ఫాస్టాగ్ ద్వారా చెల్లించటానికి వీలుంటుందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.
Also read: ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం
కొత్త పాలసీలో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటరుకు ఫిక్స్‌డ్ ఛార్జీలను వసూలు చేస్తారు. ఈ పాలసీలో రోడ్డు కాంట్రాక్టర్లకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో వారికి కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అంగీకరించింది. టోల్ చెల్లించకుండా వెళ్లే వాహనాలను నివారించటానికి భారీగా ఫైన్స్ కూడా వేయాలని కేంద్రం నిర్ణయించింది. కొత్త వ్యవస్థ ప్రస్తుతం ఉపయోగిస్తున్న FASTag వ్యవస్థ కంటే మెరుగైన టోల్ కలెక్షన్ విధానాన్ని నిర్థారిస్తుందని కేంద్రం నమ్ముతోంది.