AI Education Telangana Schools: నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో AI విద్య.. ఎంపికైన పైలట్ స్కూళ్లు ఇవే!

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నేటినుంచి AI విద్య అమలు కానుంది. పైలెట్​ ప్రాజెక్ట్‌గా 6జిల్లాల్లో 36ప్రైమరీ స్కూళ్లలో ప్రోగ్రామ్ అమలు చేయనున్నారు. 1-5వ తరగతి విద్యార్థులు FLN ద్వారా నేర్చుకున్న అంశాలను కంప్యూటర్​ ముందు చదివితే ఇది లోపాలను గుర్తించనుంది. 

New Update
tg ai schools

Telangana government schools AI education implemented in from today

AI Education Telangana Schools: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నేటినుంచి AI విద్య అమలు కానుంది. పైలెట్​ ప్రాజెక్ట్‌గా 6 జిల్లాల్లో 36 ప్రైమరీ స్కూళ్లలో ఈ ప్రోగ్రామ్ అమలు చేయనున్నారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు ఎఫ్ఎల్ఎన్​ ద్వారా నేర్చుకున్న అంశాలను కంప్యూటర్​ ముందు చదివితే ఇది లోపాలను గుర్తించనుంది. 

ఇది కూడా చదవండి: Uganda-Indian Woman:లంచం ఇచ్చాకే నీళ్లు, ఫుడ్. జైలు కష్టాలను గురించి చెప్పకొచ్చిన భారత బిలియనర్ కుమార్తె

జూమ్​ మీటింగ్​ ద్వారా ట్రైనింగ్..

ఈ మేరకు  రాష్ట్రంలో పైలెట్​ ప్రాజెక్ట్‌​గా ఎంపికైన మెదక్, భద్రాద్రి, ఖమ్మం, నారాయణపేట, మేడ్చల్, భూపాలపల్లి జిల్లాల్లోని 36 ప్రైమరీ పాఠశాలల టీచర్లకు AI సాంకేతికతకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. హెడ్ మాస్టర్​లు, టీచర్లు, సీఆర్టీలు, ఏఎంఓలు, డీఈఓలకు జూమ్​ మీటింగ్​ ద్వారా ట్రైనింగ్ ఇచ్చారు. టీచింగ్,​ లెర్నింగ్,​ మెటిరియల్ టెక్ట్స్ బుక్, వర్క్ బుక్, హ్యాండ్ బుక్స్ ను టీచర్లకు అందించారు. కంప్యూటర్​ ల్యాబ్‌​లు, ​ఏఐ లెర్నింగ్ టూల్స్, ఏఎల్ఎల్, ఏఎంఎల్​ ఇన్ స్టాల్ ​చేశారు. ఇక స్టూడెంట్స్ ఎఫ్ఎల్ఎన్​ ద్వారా తాము నేర్చుకున్న అంశాలను కంప్యూటర్​ ముందు చదివితే అది లోపాలను గుర్తిస్తుంది. దీంతో విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి టీచర్లు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 

ఇది కూడా చదవండి: Russia vs Ukraine: మళ్లీ రెచ్చిపోయిన రష్యా.. ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు!

ఎంపికైన పైలట్ స్కూల్స్..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హన్ మాన్ బస్తీ, కేటీపీఎస్​ కాలనీ, వికలాంగుల కాలనీ, తాతగుడిసెంటర్​, పాలకొయ్య తండా, ఓల్డ్​ కొత్తగూడెం ప్రైమరీ స్కూల్, ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్ సీ ఖమ్మం, మల్లెమడుగు, పాండురంగాపురం, సత్తుపల్లి, సింగారెడ్డిపాలెం, రాజేంద్రనగర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. మెదక్ జిల్లాలో తూప్రాన్, కాళ్లకల్, నర్సాపూర్, బూర్గుపల్లి, నిజాంపేట, మాసాయిపేట మండల పరిషత్​ పాఠశాలలు ఎంపికయ్యాయి. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో జనతానగర్, కొంపల్లి, ప్రగతి నగర్​, మల్లాపూర్, ఎల్లమ్మ బండ, బహదూర్ పల్లి ఉన్నాయి. వికారాబాద్​ లో ఓల్డ్ తాండూరు (తెలుగు మీడియం), దౌల్తాబాద్​, కొట్​ బాస్ పల్లి, రేగడ్​ మెల్వేరు, మల్కాపూర్ గని, తాండూ‌‌‌‌ర్​ (ఉర్దూ మీడియం). ఇక నారాయణపేట్ ​జిల్లాలో గూడె బెల్లూర్, ముడుమల్, కొల్లంపల్లె, దామరగిద్ద, కర్ని, శివాజీ నగర్ స్కూళ్లలో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అమలు కానుంది. 

ఇది కూడా చదవండి: Pawan kalyan: వైసీపీ భాష, బురద రాజకీయాలు మనకొద్దు.. అసెంబ్లీ సమావేశాలపై నేతలకు పవన్ కీలక సూచన!

ఇది కూడా చదవండి: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు