Uganda-Indian Woman:లంచం ఇచ్చాకే నీళ్లు, ఫుడ్. జైలు కష్టాలను గురించి చెప్పకొచ్చిన భారత బిలియనీర్ కుమార్తె

భారత సంతతికి చెందిన బిలియనీర్ కుమార్తె వసుంధర ఓస్వాల్‌ గతేడాది ఉగాండాలో అరెస్టయ్యారు. తమ వద్ద పనిచేసే ముకేశ్‌ మేనరియాను కిడ్నాప్ అయ్యారనేది కారణం.కానీ అతను కనిపించినప్పటికీ తనని విడిచిపెట్టలేదని వసుంధర చెప్పారు.

New Update
oswal

oswal

ఉగాండాలో హత్య, కిడ్నాప్ ఆరోపణలతో నిర్బంధానికి గురై విడుదలైన భారత సంతతికి చెందిన బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధర ఓస్వాల్‌ జైలు జీవిత అనుభావాలు గురించి చెప్పుకొచ్చారు. ఆ భయానక అనుభవాన్ని గుర్తుచేసుకున్న వసుంధర.. అత్యంత దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్నట్టు పేర్కొంది. ఎలాంటి వారెంట్ లెకుండా నిర్బంధించారని వాపోయిన ఆమె.. ఒకానొక దశలో వాష్‌రూమ్‌ కూడా వెళ్లడానికి అనుమతించలేదని తెలిపారు. బలవంతంగా తనను ఓ పోలీస్ అధికారి లాక్కెళ్లి వ్యానులోకి తోసినట్లు ఆమె వివరించారు.

Also Read: Horoscope: నేడు ఈ రాశివారు చెప్పుడు మాటలకు దూరంగా ఉంటే మంచిది!

తమ ఇంటిలో పనిచేసే ముకేశ్ అనే వ్యక్తి అదృశ్యమవ్వడంతో గతేడాది అక్టోబరు 1న ఉగాండా పోలీసులు వసుంధర ఓస్వాల్‌ను కిడ్నాప్, హత్య ఆరోపణల కింద అరెస్ట్ చేశారు. అదృశ్యమైన వ్యక్తి టాంజానియాలో కనిపించినా..న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసినా.... తనను విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేశారని వసుంధర వివరించారు.

Also Read: Hezbollah-Nasralla: నసల్లా అంత్యక్రియలు..జనసంద్రంగా మారిన రోడ్లు..!

నరకం అంటే ఎలా ఉంటుందో...

‘అక్టోబరు 1న ఎలాంటి వారెంట్‌ లేకుండా పోలీసులు మా ఇంట్లోకి ప్రవేశించారు.. ప్రశ్నిస్తే ఇది ఐరోపా కాదు.. ఉగాండా అని సమాధానం ఇచ్చారు. ఇంటర్‌పోల్‌ అధికారిని కలవాలంటూ బలవంతంగా ఓ పోలీసు అధికారి లాక్కెళ్లి వ్యాన్‌లో పడేసి.. పాస్‌పోర్టు కూడా తీసేసుకున్నారు. పోలీస్‌ బాండ్‌ కోసం 30 వేల డాలర్లు కట్టాలని చెప్పారు.. ఆ మొత్తాన్ని చెల్లించినా నాకు ఎలాంటి బాండ్‌ ఇవ్వలేదు.. మూడు రోజులు నిర్బంధం అనంతరం నకసోంగోలా జైలుకు తరలించారు. రెండు వారాలకుపైగా అక్కడ నరకం అంటే ఎలా ఉంటుందో చూపించారు. కనీసం నీళ్లు, భోజనం ఇవ్వలేదు. స్నానం చేయనివ్వలేదు. కనీసం నన్ను వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనివ్వలేదు.. లంచం ఇచ్చాకే ఆహారం, నీరు ఇచ్చేవారు.’’ అని వసుంధర తెలిపారు. తనపై నమోదు చేసిన కేసును డిసెంబరు 21న కోర్టు కొట్టివేసిందని వసుంధర తెలిపారు.

ఉగాండాలో తమ కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థల కార్యకలాపాల పరిశీలించేందుకు వెళ్లిన వసుంధరను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఆమె సోదరి రిధి ఓస్వాల్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. కిడ్నాప్, హత్య అభియోగాల పేరుతో తమ సోదరిని అక్రమంగా నిర్బంధించారని, అత్యంత దుర్బరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని రిధి ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పులతో నిండిపోయిన ఒక గదిలో 90 గంటల పాటు బలవంతంగా ఉంచారని, ఐదురోజుల పాటు స్నానానికి, దుస్తులు మార్చుకోవడానికి కూడా అనుమతించలేదని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు చేశారు. 

Also Read: Slbc Tunnel Accident: ఆ 8 మంది ఎక్కడ...ఎలా ఉన్నారో...సవాల్‌ గా మారిన సహాయక చర్యలు!

Also Read: champions trophy: విరాట్ కోహ్లీ ప్రభంజనం.. ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు