/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet3-1-jpg.webp)
Pawan kalyan: ఏపీలో గత ప్రభుత్వం వైసీపీ నేతలు ఉపయోగించిన భాష, పద్ధతులను ఎవరూ ఆచరించకూడదని డిప్యూటీ సీఎం పార్టీ నేతలకు సూచించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జనసేన పార్టీ సామాన్యుడి గొంతుగా ఉండాలన్నారు. ప్రజల సమస్యలను, ఆకాంక్షలను, ఆశలను, సంక్షేమాన్ని, చట్టసభల్లో వినిపించేలా పార్టీ తరఫున ఎన్నికైన ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యులు చర్చల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో సభ్యులకు దిశానిర్దేశం చేశారు. శాసనసభ సంప్రదాయాన్ని, మర్యాదను కాపాడుతూ హుందాగా ముందుకు వెళ్దామని చెప్పారు. చట్ట సభలలో ఎంత విలువైన చర్చలు జరిగేవో అందరూ పరిశీలించాలన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకొని చర్చల్లో పాల్లొనాలని తెలిపారు.
స్ఫూర్తి చర్చల్లో కనిపించాలి..
ఈ మేరకు ఏపీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి మొదలకానున్న నేపథ్యంలో జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ముందుగా పార్టీ పీఏసీ ఛైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వాగత ఉపన్యాసం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో పార్టీ విధివిధానాలు అనుసరించి చర్చల్లో బలంగా పాల్గొనాలని, పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో ముందుకు వెళ్లాలని సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పవన్ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అంకిత భావంతో పని చేస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం మనందరం కట్టుబడి ఉండాలని, ఆ స్ఫూర్తి పాల్గొనే చర్చల్లో కనిపించాలి సూచించారు.
ఇది కూడా చదవండి: Bus Burned: తెలంగాణలో ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు దగ్ధం: ప్రయాణికులంతా!
దిగజారుడు భాష వాడింది..
శాసనసభ్యులు మాట్లాడే ప్రతి పదం ఎంతో ప్రభావవంతమైనది. చట్టసభల్లో మాట్లాడే భాష విషయంలో, వాడే పదాల విషయంలో సభ్యులు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అభ్యంతరకర పదజాలం వాడవద్దు. హుందా అయిన భాష, గౌరవంతమైన పదాలను నాతో సహా ప్రతి ఒక్కరూ వినియోగించాలి. చట్టసభల్లో మనం మాట్లాడే ప్రతి విషయాన్ని ప్రజలంతా చూస్తున్నారని, వారి ఎదురుగా మనం మాట్లాడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వైసీపీ దిగజారుడు భాష వాడింది. ఆ తరహా భాష వద్దు. వైసీపీ నేతలు పూర్తిగా బురదలో కూరుకుపోయారు. వారి బురద మనకు అంటించాలని చూస్తారు. వారి బురద రాజకీయాలకి పడకుండా, వారు రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా హుందాగా వ్యవహరించాలి. వైసీపీ ప్రజాప్రతినిధులు బూతులు, అసభ్య పదజాలంతో ఈ బడ్జెట్ సమావేశాల్లో రెచ్చగొట్టినా సంయమనం పాటించండి. వైసీపీ వాళ్లు దిగజారుడు వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారు ఏదో అన్నారని మీరు దిగజారి ఇష్టానుసారం భాషను వాడొద్దు. స్పందించే సందర్భంలో హుందాగా సమాధానం ఇవ్వండి. చట్టసభల్లో మాట్లాడే ప్రతి మాటను జనసేన ప్రజాప్రతినిధులు ఆచితూచి వాడాలి. మనలో ఎక్కువ మంది, నాతో సహా తొలిసారి ఎన్నికైన వారు ఉన్నారంటూ పవన్ కీలక సూచనలు చేశారు.
ఇది కూడా చదవండి: Hezbollah-Nasralla: నసల్లా అంత్యక్రియలు..జనసంద్రంగా మారిన రోడ్లు..!