Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత

దుబాయ్ వేదికగా జరిగిన పాక్ వెర్సస్ ఇండియా మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. నలుగురు భారత ఆటగాళ్ళు వ్యక్తిగత రికార్డులను  తమ ఖాతాల్లో వేసుకున్నారు.  కింగ్ కోహ్లీ అయితే ఏకంగా మూడు రికార్డులను మూటగట్టుకున్నాడు.

author-image
By Manogna alamuru
New Update
cric

Virat, Pandya, Kuldeep

పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న గెలుపును అందుకుంది. దాంతో పాటూ నలుగురు భారత ఆటగాళ్ళు వ్యక్తిగత రికార్డులతో మోత మోగించారు. అందరికంటే ముందు మ్యాచ్ ను ఒంటిచేత్తో గెలిపించిన కింగ్ కోహ్లీ గురించి ముందు చెప్పుకోవాలి. అత్యంత తొందరగా, అతి తక్కువ మ్యాచ్ లలోనే 14 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. సచిన్‌, సంగక్కరల రికార్డులను సైతం బ్రేక్ చేశాడు. సచిన్ టెండుల్కర్‌ 350 ఇన్నింగ్స్‌లో 14 వేల పరుగులు చేశాడు. కానీ విరాట్ కోహ్లి 287 ఇన్నింగ్స్‌లోనే 14 వేల పరుగులు దాటాడు. దాంతో పాటూ అతి తక్కువ మ్యాచ్ లలో ఎక్కువ సెంచరీలను చేసిన వ్యక్తి గా నిలిచాడు. విరాట్ ఇప్పటివరకు 51 సెంచరీలు చేశాడు. అలాగే మహ్మద్‌ అజారుద్దీన్‌ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లి 158 క్యాచ్‌లతో మొదటి స్థానంలో ఉన్నారు. 

ఓపెనర్ గా 9 వేలు..

ఇక టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అరుదైన ఘనతను సాధించాడు. వన్డేల్లో 9 వేల పరుగులు పూర్తి చేసిన మూడో భారత ఓపెనర్ గా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఘనత సాధించిన మరో ఇద్దరు భారత క్రికెటర్లు..  సచిన్ టెండూల్కర్,  సౌరవ్ గంగూలీ మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్‌లో చూస్తే.. ఓపెనర్‌గా ఈ ఘనత సాధించిన ఆరవ బ్యాటర్ రోహిత్ శర్మ. 

200 ఒకరు, 300 మరొకరు..

వీరి తర్వాత బౌలింగ్ లో మరో ఇద్దరు భారత క్రికెటర్లు రికార్డులు సృష్టించారు. ఈ రోజు మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టిన పాండ్యా అంతర్జాతీయ క్రికెట్ లో 200 వికెట్లు కంప్లీట్ చేసుకున్నాడు. ఇతనితో పాటూ  కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు. దీంతో ఇతను అంతర్జాతీయ క్రికెట్ లో 300 వికెట్లు తీసుకున్న బౌలర్ల క్లబ్ లో చేరాడు. 

Also Read: Champions Trophy: శుభ్ మన్ గిల్ ను వెళ్ళు వెళ్ళు అన్న అబ్రార్

Advertisment
తాజా కథనాలు