Tirumala:భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల...శ్రీవారి దర్శనానికి 18 గంటలు!

తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుంది. వేసవి సెలవులు రావడంతో పాటు రెండు రాష్ట్రాల్లో వివిధ పరీక్షల ఫలితాల విడుదల కావడంతో రద్దీ పెరుగుతుంది.స్వామి వారి దర్శనానికి సుమారు18 గంటల సమయం పడుతుంది.

New Update
ttd

వేసవి సెలవులు రావడంతో  పాటు రెండు రాష్ట్రాల్లో వివిధ పరీక్షల ఫలితాల విడుదల కావడంతో పాటు, పైగా వరుస సెలవులు కూడా రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, వీరికి శ్రీవారి దర్శనం చేసుకోవడానికి దాదాపు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.  అలాగే, స్లాటెడ్‌ టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులకు కూడా మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తుంది. భక్తుల రద్దీ పెరిగిన క్రమంలో గదులకు డిమాండ్‌ కూడా విపరీతంగా పెరిగింది.

Also Read:  Ayodhya: అయోధ్యలో రామయ్య దర్శనానికి 80 మీటర్ల సొరంగం

గదుల కోసం భక్తులు రెండు మూడు గంటల పాటు క్యూలైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కల్యాణ కట్టలతో పాటు శ్రీవారి ఆలయ ప్రాంతం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం ప్రాంతాల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. కాగా, నిన్న శ్రీవారిని 78, 821 మంది భక్తులు దర్శించుకున్నారు. సుమారు 33, 568 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 

Also Read: BIG BREAKING: తిరుమలలో అగ్ని ప్రమాదం!

ఇక, స్వామివారి హుండీ ఆదాయం 3.36 కోట్ల రూపాయలు వచ్చింది. భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అల్పహారం, పాలు, టీ అందిస్తుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టింది. తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగింది.. ఒక్కసారిగా భక్తులు కొండకు పోటెత్తారు. గురువారం రాత్రి నుంచి రద్దీ క్రమంగా పెరుగుతుంది.

శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ దగ్గర భక్తుల వాహనాలు బారులు తీరాయి. ఆ రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. ఏకంగా అలిపిరి కాలినడక మార్గం శ్రీవారి పాదాల మండపం ఆర్చి వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ పెరిగిపోవడంతో వాహనాల తనిఖీ ఆలస్యమవుతోంది. టీటీడీ అధికారులు చర్యలు చేపట్టి.. వాహనాల రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు. ఆదివారం కూడా రద్దీ కొనసాగుతుందని భావిస్తున్నారు. 

వరుసగా మూడు రోజుల పాటూ సెలవులు రావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకుభక్తులు భారీగా తరలి వస్తున్నారు. తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాల్లో తరలిరావడంతో తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వాహనాలతో కిక్కిరిసిపోయింది. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తిరుమలలో ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. 

టీటీడీ అందిస్తున్న సౌకర్యాల గురించి స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆలయం ముందు శ్రీవారిని దర్శించుకున్న భక్తులని కలిసి మాట్లాడారు. తిరుమలలో దర్శన ఏర్పాట్లు, క్యూ లైన్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా టీటీడీ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

 ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ మేరకు కళ్యాణకట్టను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. భక్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా సేవాభావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.

Also Read:Musk-India:-Modi: త్వరలోనే ఇండియాకు రాబోతున్నా..: ఎలాన్ మస్క్

Also Read: Telangana: వదలని వర్షాలు.. మరో 2 రోజులు వానలే..వానలు..!

telugu-news | tirumala | latest-news | ttd | devotees | rush | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు