/rtv/media/media_files/2025/04/20/0M8ewBXE9rYkd3yjiR0T.jpg)
tirumala car
తిరుమలలో కారు దగ్ధమైంది. అయితే అందులో ప్రయాణించిన భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. తిరుమలలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్‌తో కారు అగ్నికి ఆహుతి అయ్యింది. కౌస్తుభం గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న కార్ పార్కింగ్ వద్ద ఏసీ ఆన్ చేయడం వల్ల కారులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి, కారు కాలిపోయింది.
Also Read: Crime: మరో రెండు రోజుల్లో పెళ్లి.. కాబోయే భర్తపై యువతి దారుణం.. ప్రియుడితో కలిసి!
తిరుమలలో అగ్నికి ఆహుతి అయిన కారు
— JAGANANNAMEDIA (@JAGANANNAMEDIA) April 18, 2025
కౌస్తుభం గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న కార్ పార్కింగ్ వద్ద ఏసీ ఆన్ చేయడం వల్ల కారులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి, కాలిపోయిన కారు..
ఆ దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గట్టిగానే చెబుతున్నాడు.
ఒకదాని తర్వాత ఒకటి వరుస… pic.twitter.com/Wms3GpZpkD
Also Read: CM Chandra Babu: 14 ఏళ్ళు ముఖ్యమంత్రి..45 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం..అనితరసాధ్యుడు చంద్రబాబు
ఒంగోలుకు చెందిన నరేంద్ర ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలు నుంచి తన కారులో తిరుమలకు బయల్దేరారు. తెల్లవారు జామున తిరుమలకు చేరుకుని స్థానిక సీఆర్పో పార్కింగ్ వద్ద కారు పార్కు చేశాడు. అంతే ఒక్కసారిగా కారు ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారులోని నరేంద్ర కుటుంబ సభ్యులు అంత కూడా వెంటనే బయటకు దిగిపోయారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తిరుమలలో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంపై భక్తులు ఆందోళన పడుతున్నారు.
Also Read:Odela 2 Collections: “ఓదెల 2” ఫస్ట్ డే కలెక్షన్స్ తుస్.. విజువల్స్ ఎక్కువ విషయం తక్కువ..!
tirumala | fire accident | ttd | ongole | latest-news | latest-telugu-news | latest telugu news updates