Miss World 2025: టాలెంట్ ఫైనల్ రౌండ్ విజేతగా మిస్ ఇండోనేసియా.. నృత్యాలు, పాటలతో మారుమోగిన మిస్ వరల్డ్ వేదిక

మిస్ వరల్డ్ 2025 టాలెంట్ ఫైనల్ రౌండ్ శిల్పకళా వేదికగా అట్టహాసంగా జరిగింది. ఇందులో మిస్ ఇండోనేసియా  టాలెంట్ రౌండ్  విజేతగా నిలవగా..  మిస్ కెమెరూన్ – రెండవ స్థానం, మిస్ ఇటలీ- మూడవ స్థానంలో నిలిచారు.  

New Update
miss world 2025 talent round finalistsl

miss world 2025 talent round finalistsl

Miss World 2025:  మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు శిల్పకళా వేదికగా జరిగిన  మిస్ వరల్డ్ 2025 టాలెంట్ ఫినాలే రౌండ్ ప్రేక్షకులను మంత్రిముగ్ధుల్ని చేసింది. ఇందులో ఫైనల్ రౌండ్ కి ఎంపికైన 24 దేశాల అందాల తారలు వేదికపై తమ ప్రతిభను చూపారు.  గానం, నృత్యం, పియానో, బాలే, ఏరియల్ ఆర్ట్ వంటి ఎన్నో విభిన్న కళల్లో తమ ప్రతిభను కనబరిచారు.

టాలెంట్ ఫైనల్ రౌండ్

మిస్ యునైటెడ్ స్టేట్స్  పాట-నృత్యంతో రౌండ్ ప్రారంభమైంది.  ఆ తర్వాత మిస్ నైజీరియా "Unity in Motion" డాన్స్‌ తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. మిస్ మాల్టా, ఇండోనేసియా, ఎస్టోనియా, బ్రెజిల్, నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెమెరూన్, జర్మనీ, కేమన్ ఐలాండ్స్, వేల్స్, జమైకా, ఇటలీ తదితర దేశాల అందాల తారలు తమ విభిన్న ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. 

భారతదేశం తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా, ‘నగాడా సంగ్ ఢోల్’ పాటపై గర్భ నృత్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. చివరిగా, మిస్ కెన్యా DJ షో తో వేదిక మారుమోగింది. 

nandini gupta mis india
nandini gupta mis india

 

టాలెంట్ ఫైనల్ రౌండ్ విజేతలు 

మిస్ ఇండోనేసియా  టాలెంట్ రౌండ్  విజేతగా నిలవగా..  మిస్ కెమెరూన్ – రెండవ స్థానం, మిస్ ఇటలీ- మూడవ స్థానంలో నిలిచారు. 10న హైదరాబాద్ లో  వైభవంగా ప్రారంభమైన  అందాల పోటీలు  మే 31 వరకు జరుగుతాయి. 31 హైటెక్ సెంటర్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. 

telugu-news | cinema-news | latest-news | miss world 2025 talent final 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు