/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ECI-jpg.webp)
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. జూబ్లీహిల్స్ శాసనసభ స్థానం ఖాళీ అయినట్లు తమకు గెజిట్ వచ్చిందన్నారు. దాన్ని తాము కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లు వివరించారు. అయితే.. డిసెంబర్ లోగా ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉందన్నారు.
ఈ నెల 8న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందారు. హార్ట్ ఎటాక్ కారణంగా AIG ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. గత ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. దీంతో మరో సారి తమ సిట్టింగ్ సీటును దక్కించుకోవాలని బీఆర్ఎస్ ఇప్పటి నుంచి వ్యూహాలు ప్రారంభించింది. మాగంటి కుటుంబం నుంచే ఆ పార్టీ అభ్యర్థిని పోటీలోకి దించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : కోర్టు ఆగ్రహానికి గురైన కన్నప్ప సినిమా.. సెన్సార్ లేకుండానే విడుదలపై సందేహాలు
ఇది కూడా చదవండి: ఫిట్‌గా ఉండాలనుకుంటే వేలు, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు.. ప్రతిరోజూ ఇలా చేయండి!
కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
అధికార కాంగ్రెస్ కూడా ఎలాగైనా జూబ్లీహిల్స్ లో ఈ సారి విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో క్రికెటర్ అజారుద్దీన్ కు టికెట్ ఇచ్చిన ఆ పార్టీ.. ఈ సారి కొత్త అభ్యర్థి కోసం వెతుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పీజేఆర్ కూతురు విజయారెడ్డిని ఇక్కడి నుంచి పోటీకి దించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నవీన్ యాదవ్ పేరు కూడా ఆ పార్టీ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో దూకుడు మీద ఉన్న బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ను సీరియస్ గా తీసుకునే ఛాన్స్ ఉంది. ఆ పార్టీ కూడా బలమైన అభ్యర్థి కోసం ఆపరేషన్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికలు వచ్చే లోగా అభ్యర్థులను ఖరారు చేయాలన్న ఆలోచనలో ప్రధాన పార్టీలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: మీరు ప్రతిరోజూ వాటర్ చెస్ట్‌నట్ తింటే ఏమవుతుంది? నిజాలివే!
Also Read : హైదరాబాద్‌లో విచిత్రమైన ఏటీఎం చోరీయత్నం.. దొంగతనానికి వచ్చి నిద్రపోతున్నావేంట్రా..!!
latest-telugu-news | cec | Jubilee Hills Assembly By Elections 2025 | today-news-in-telugu | breaking news in telugu | latest telangana news