Baba Ramdev: మనిషి ఆయుష్షు 150-200 ఏళ్లు: బాబా రాందేవ్‌

మనిషి ఆయుష్షుపై యోగా గురు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవుడి సహజ జీవితకాలం 100 ఏళ్ల కాదని.. కనీసం 150-200 వరకు ఉంటుందని పేర్కొన్నారు. నటి షఫాలీ జరివాలా ఆసస్మిక మరణం అనంతరం ఆయన ఇలా వ్యాఖ్యానించారు.

New Update
Baba ram dev

Baba ram dev

మనిషి ఆయుష్షుపై యోగా గురు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవుడి సహజ జీవితకాలం 100 ఏళ్ల కాదని.. కనీసం 150-200 వరకు ఉంటుందని పేర్కొన్నారు. నటి షఫాలీ జరివాలా ఆసస్మిక మరణం అనంతరం.. ఆమె వాడిన యాంటి ఏజింగ్ ట్యాబ్లెట్లపై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే  మీడియాతో మాట్లాడిన రాందేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేశారు. '' మానవుడి సహజ జీవితకాలం 100 ఏళ్లు కాదు. 150 నుంచి 200 వరకు ఉంటుంది. 

Also Read: పక్క రాష్ట్రాల్లోని ఫోన్లూ ట్యాప్‌ చేయచ్చు..కానీ ఎట్లనో తెలుసా?

Ramdev In Anti-Ageing Debate

ఈ మధ్యకాలంలో మనం మెదడు, కళ్లు, గుండె, కాలేయంపై ఎక్కువ ఒత్తిడి పెడుతున్నాం. ఇప్పటి ప్రజలు 100 ఏళ్లు తినాల్సిన ఆహారాన్ని కేవలం 25 ఏళ్లలోనే తీసుకుంటున్నారు. అందరికీ ఆహార క్రమశిక్షణ, మంచి జీవనశైలి అవసరం. నాకు ఇప్పుడు 60 ఏళ్లు దాటాయి. నిత్యం యోగా చేయడం, మంచి ఆహారం, జీవనశైలి కారణంగా ఆరోగ్యంగా ఫిట్‌గా ఉన్నానని'' బాబా రాందేవ్ అన్నారు. 2021లో గుండెపోటుతో మరణించిన నటుడు సిద్ధార్థ్ శుక్లా, ఇటీవ మృతి చెందిన నటి షఫాలీ గురించి ప్రస్తావిస్తూ మనవ శరీరం లోపలి నుంచి బలంగా తెలిపారు.  

Also Read: అది జరిగితే మరుసటిరోజే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా: ఎలాన్‌ మస్క్

మన శరీరంలో ప్రతీ కణానికి సహజమైన జీవితకాలం ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై ప్రభావం పడేలా ఏదైనా చేస్తే.. అది అంతర్గతంగా ఇబ్బందులు తలెత్తేలా చేస్తుందని పేర్కొన్నారు. ఫలితంగా ఇది గుండెపోటు లాంటి పరిస్థితులకు దారితీస్తుందని పేర్కొన్నారు. 

Also Read: అది జరిగితే మరిసటిరోజే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా: ఎలాన్‌ మస్క్

Also Read :  బీజేపీ అధ్యక్ష పదవి మిస్.. ఎంపీ ఈటల ఫస్ట్ రియాక్షన్!

telugu-news | baba-ramdev | rtv-news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu

Advertisment
తాజా కథనాలు