/rtv/media/media_files/2025/12/24/cm-revanth-2025-12-24-17-11-29.jpg)
CM Revanth
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు(telangana panchayat election 2025) ముగియడంతో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. కొత్త ఏడాదిలో పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామాలకు రూ.5 లక్షల చొప్పున స్పెషల్ డెవలప్‌మెట్ నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సేవ చేసేందకు ఇంతకన్నా మంచి అవకాశం రాదని తెలిపారు. కొడంగల్‌లో నిర్వహించిన సర్పంచ్ సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
LIVE | Hon’ble CM Sri A. Revanth Reddy felicitates the newly elected Sarpanches at Kodangal https://t.co/yQ3XuOC9UT
— Revanth Reddy (@revanth_anumula) December 24, 2025
Also Read : 2029 ఎన్నికల్లో స్వతంత్రంగానే బరిలో దిగుతాం.. కవిత సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy Good News To Newly Elected Sarpanches
ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధం లేకుండా ఈ నిధులు విడుదల చేస్తామని అన్నారు. '' తెలంగాణ అంటేనే నీళ్లు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి పంపకాల్లో అన్యాయం చేశారు. తెలంగాణ వస్తే నీటి సమస్య తీరుతుందని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. పదేళ్ల పాలనలో పాలమూరును ఎండబెట్టారు. కేసీఆర్ వలస వచ్చి పాలమూరు ఎంపీ అయ్యారు.ఆ తర్వాత సీఎం అయ్యారు. అయినా కూడా పాలమూరుకు నీళ్లు రాలేదు. వేసుకోవడానికి బట్టలు, తిరగడానికి చెప్పులు లేని వాళ్లకి పదేళ్లలో వేల కోట్ల ఆస్తులు, ఫామ్‌హౌస్‌లు వచ్చాయి.
రెండేళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. వారి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నో పాపాలు చేశారు. నేను ఎవరిపైనా కేసులు పెట్టలేదు. వేధించలేదు. ఎవరిపాపాన వారే పోతారని సైలెంట్‌గా ఉన్నారు. మా తోలు తీస్తానని కేసీఆర్ అంటున్నారు. మా తోలు తీయడం కాదు. మా సర్పంచ్‌లే మీ తోలు తీస్తారని'' సీఎం రేవంత్ అన్నారు.
Also Read : త్వరలో న్యూయర్ వేడుకలు.. పెద్ద ఎత్తున డ్రగ్స్ దందాలు
Follow Us