/rtv/media/media_files/2025/11/14/brs-loss-jubilee-2025-11-14-13-36-05.jpeg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(by election in jubilee hills 2025)ల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా పాతలేకపోయింది(brs-defeat). దాదాపు రెండు నెలల నుంచి పక్కా ప్లాన్ తో ఎంత పోరాడినా సిట్టింగ్ సీటును కాపాడుకోలేకపోయింది. గ్యారెంటీగా గెలుస్తామన్న ధీమాతో ఉన్న బీఆర్ఎస్ భారీ తేడాతో ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశలో మునిగిపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(naveen yadav) ఘన విజయం సాధించారు. 20 వేలకు పైగా మెజార్టీ ఓట్లతో నవీన్ యాదవ్ గెలిచారు. ప్రచారంలో కేసీఆర్ లోటే ఓటమికి ప్రధాన కారణమని చెప్పుకొచ్చు. బీఆర్ఎస్ కారు జూబీహిల్స్‌లో సత్తా చాటలేకపోయింది. బీఆర్ఎస్ ఓటమికి ఆరు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1. ఫెయిలైయిన సెంటిమెంట్
మాగంటి గోపీనాథ్ అకస్మిక మరణాంతరం వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆయన భార్యకే సీటు ఇచ్చింది. అయినా సానుభూతి వర్కౌట్ కాలేదు. ఆశించినట్లుగా ఆంధ్రా సెటిలర్స్, కమ్మ సామాజిక వర్గం కూడా మాగంటి సునీత, బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడలేదు.
2. మాగంటి ఫ్యామిలీలో గొడవలు
మాగంటి గోపీనాథ్ మొదటి భార్య సునీత, ఆయన తల్లి మహానంద కుమారి తగాదాలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ విఫలమైంది. గోపీనాథ్ మరణాంతరం ఆయన అన్న వజ్రానాథ్‌కు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించారు. తల్లితో కలిసి వజ్రానాథ్ పార్టీ క్యాడర్‌తో సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే బీఆర్ఎస్ మాత్రం మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వజ్రానాథ్ ను ఒప్పించి సునీత తరఫున ప్రచారం చేయించడంలో బీఆర్ఎస్ నేతలు విఫలం అయ్యారు.
3. కేటీఆర్ ఒంటరి పోరాటం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ను గెలిపించడం కోసం కేటీఆర్ ఒంటరి పోరాటం చేశారు. కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉండటం, అటు హరీష్ రావు తండ్రి మరణించడంతో ఆయన కూడా ప్రచారానికి దూరమైయ్యారు. దీంతో కేటీఆర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి 15 మంది మంత్రులు, ముఖ్యమంత్రి కూడా తమ పార్టీని గెలిపించాలని పోరాటం చేశారు.
4. మైనార్టీ ఓటు బ్యాంక్ నిలుపుకోలేకపోడం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో లక్షకుపైగా ముస్లీం ఓటర్లే. మొదట్లో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కే మైనార్టీ ఓటర్ల పట్టం కట్టాలనుకున్నారు. కానీ ఇదే నియోజకవర్గం నుంచి గతంలో రెండు సార్లు వరుసగా పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ మహమ్మద్‌కు కాంగ్రెస్ సర్కార్ మంత్రి పదవి ఇచ్చింది. దీంతో ఆయనపై సానుభూతి ఉన్న మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీవైపుకు తిరిగారు. అంతేకాదు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బోరబండ, రహమత్‌నగర్ కార్పొరేటర్లు వారి మైనార్టీ కేడర్ తో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ మైనార్టీ క్యాడర్ బలం తగ్గింది.
Also Read : జూబ్లీహిల్స్ పై రేవంత్ 6 అస్త్రాలు.. కాంగ్రెస్ గెలుపుకు ప్రధాన కారణాలివే!
5. అధినేత KCR రంగంలోకి దిగలే..
బీఆర్ఎస్ పార్టీకి మెయిన్ ఫేస్ కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో BRS పరాభవం నుంచి ఆయన మీడియా, ప్రజల ముందుకు రావడం లేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలోనైనా కేసీఆర్ బయటకు వస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన పార్టీ తరపున ప్రచారాని కాదుకదా, అభ్యర్థికి ఓటేయమని వీడియో కూడా విడుదల చేయలేదు. దీంతో ప్రచారంలో జోష్ రాలేదు. అలాగే హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతల సమయంలో చాలామంది బాధితులు కేసీఆర్ బయటకు రావాలని కోరుకున్నారు. కానీ ఆయన రెండు మూడు ప్రెస్‌మీట్‌లతో సరిపెట్టుకున్నారు.
6. BRS ఓవర్ కాన్ఫిడెన్స్
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రెండు సార్లు గెలిచాం.. ఈ ఉప ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తామనే బీఆర్ఎస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఎన్నికలకు పక్కా ప్లానింగ్ చేసుకోలేదు. గ్రౌండ్ లెవల్‌లో పోల్ మేనేజ్‌మెంట్ చేయకపోవడం.. ముఖ్యంగా హైదారాబాద్ ఓటర్లు బీఆర్ఎస్‌నే గెలిపిస్తారనే ధీమా BRSలో భాగా ఉంది. అధికార పార్టీపై బాగా వ్యతిరేకత ఉందనే విషయాన్ని కారు పార్టీ నాయకులు బాగా నమ్మారు. కానీ ఆ వ్యతిరేకతను ఎలా తమవైపుకు తిప్పుకోవాలనే ప్లానింగ్‌లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యింది. మొదట్లో కారు విజయం పక్కా అని అందురూ అనుకున్నారు. ఏయే అంశాలు బీఆర్ఎస్‌కు ప్లస్ అవుతాయో చూసుకొని రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి వాటిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. దీంతో పోలింగ్‌కు 10 రోజులు ముందే కాంగ్రెస్ గేమ్ ఛేంజ్ చేసింది.
Follow Us