/rtv/media/media_files/2025/11/14/jubilee-hills-by-election-2025-results-2025-11-14-11-18-30.jpg)
Jubilee Hills By Election 2025 Results
Jubilee Hills By Election Results: ఉత్కంఠ.. మరికాసేపట్లో రిజల్డ్స్....కాకరేపుతోన్న జూబ్లీహిల్స్ !
తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడనుంది. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా అనివార్యమైన ఈ ఉప ఎన్నిక జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడనుంది. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా అనివార్యమైన ఈ ఉప ఎన్నిక జరిగింది, ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుండడంతో అన్ని వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
నవంబర్ 11న జరిగిన పోలింగ్‌లో ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపారనే విషయంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. ఈ ఉప ఎన్నిక ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరుగా మారింది. ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా భావించడంతో, ముఖ్య నాయకులు విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో
ఎన్నికల ఫలితాల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఒక వరుసకు 21 టేబుళ్ల చొప్పున మొత్తం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఫలితాలను 10 రౌండ్‌లలో లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్‌కు సుమారు 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని, ఈ లెక్కన మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు.
186 మంది సిబ్బంది
కౌంటింగ్ ప్రక్రియ కోసం 186 మంది సిబ్బందిని నియమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్‌కు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది.
అప్‌డేట్స్‌ను ఎల్ఈడీ స్క్రీన్లు, ఈసీ యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. కౌంటింగ్ సెంటర్‌లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతిచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈవో హెచ్చరించారు.
- Nov 14, 2025 11:48 IST
సీఎంను కలవనున్న మంత్రులు..
- జూబ్లీహిల్స్ క్లబ్‌లో మంత్రుల సమావేశం.
- ఎన్నికల కౌంటింగ్ విధానం, పురోగతిని మంత్రులు సమీక్షిస్తున్నారు.
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రతి డివిజన్‌కు ఇంచార్జీలుగా ఉన్న మంత్రులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
- డివిజన్‌ల వారీగా పోలింగ్ శాతాన్ని కూడా మంత్రులు గమనిస్తున్నారు.
- మధ్యాహ్నం 12 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు కలవనున్నారు.
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తాజా ఫలితాలను సీఎంకు వివరిస్తారు
- Nov 14, 2025 11:46 IST
కాసేపట్లో సీఎంను కలవనున్న మంత్రులు..
- Nov 14, 2025 11:46 IST
ఏడో రౌండ్ లెక్కింపు లెక్కింపు పూర్తి
- Nov 14, 2025 11:01 IST
గాంధీ భవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు
- Nov 14, 2025 10:57 IST
Jubilee Hills by Election Results 2025: రౌండ్ 3 అధికారిక ప్రకటన
/rtv/media/post_attachments/a8f39307-78a.png)
- Nov 14, 2025 10:49 IST
ఐదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3178 ఓట్ల లీడ్
- ఐదో రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం
- ఐదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3178 లీడ్
- ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ ఆధిక్యం – 12,651
- Nov 14, 2025 10:48 IST
సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో లక్ష్మి దేవి పూజ
- Nov 14, 2025 10:47 IST
గాంధీ భవన్ లో మొదలైన సంబరాలు.. భారీ మెజారిటీ దిశగా కాంగ్రెస్
- Nov 14, 2025 10:42 IST
ఐదో రౌండ్‌లోనూ కాంగ్రెస్ లీడ్
ఐదో రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం
ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ లీడ్ – 9501 ఓట్లు
- Nov 14, 2025 10:38 IST
మంత్రి పొన్నం ప్రభాకర్..
జూబ్లీహిల్స్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి పని చేశారు.
కిషన్ రెడ్డికి బీఆర్‌ఎస్ మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేసింది.
కిషన్ రెడ్డి ఇప్పుడు దీని పై సమాధానం చెప్పాలి.
ఈ పరిణామం తర్వాత ఢిల్లీ, గల్లీలో బంధుత్వం (దోస్తీ) పెరిగింది.
ఎన్ని కుట్రలు అయినా, భారీ మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది.
- Nov 14, 2025 10:33 IST
ఒక్క నాలుగో రౌండ్ లో 3547 ఓట్ల ఆధిక్యం..
రహ్మత్ నగర్..వెంగళరావు నగర్ ప్రాంతాల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ కు ఓట్లు
- Nov 14, 2025 10:28 IST
ముగిసిన నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు
- Nov 14, 2025 10:28 IST
దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి.. 9వేలకు పైగా ఆధిక్యంలో నవీన్ యాదవ్
- Nov 14, 2025 10:19 IST
Jubilee Hills By Election 2025 Results: రెండో రౌండ్‌లో ఓట్ల వివరాలిలా
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/11/14/jubilee-hills-by-election-2025-results-2025-11-14-10-19-38.jpeg)
Jubilee Hills By Election 2025 Results - Nov 14, 2025 10:11 IST
కొనసాగుతున్న నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు
- Nov 14, 2025 10:06 IST
Jubilee Hills By Election 2025 Results:
- మూడవ రౌండ్‌లో బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యం సాధించింది.
- బీఆర్ఎస్‌కు 12,503 ఓట్లు వచ్చి 211 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
- బీజేపీ 401 ఓట్లకు పరిమితమైంది.
- Nov 14, 2025 10:05 IST
మూడో రౌండ్‌లో బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యం
- Nov 14, 2025 10:04 IST
జూబ్లీ కౌంటింగ్.. 3వ రౌండ్‌లో పుంజుకున్న BRS
- Nov 14, 2025 09:59 IST
జూబ్లీహిల్స్‌లో గెలుపు కాంగ్రెస్‌దే – టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
- Nov 14, 2025 09:35 IST
కొనసాగుతున్న మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు
- Nov 14, 2025 09:30 IST
మూడో స్థానంలో బీజేపీ.. రెండు రౌండ్లలో 307 ఓట్లు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది
రెండు రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగింది
బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది
బీజేపీ మూడో స్థానంలో మాత్రమే ఉంది
రెండు రౌండ్లలో బీజేపీకి మొత్తం 307 ఓట్లు మాత్రమే వచ్చాయి
- Nov 14, 2025 09:27 IST
రెండో రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం
- Nov 14, 2025 09:08 IST
జూబ్లీహిల్స్ అప్డేట్ :
రెండవ రౌండ్ లో 127 ఓట్ల ఆదిక్యం లో కాంగ్రెస్
- Nov 14, 2025 09:06 IST
మొదలైన రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు..
- Nov 14, 2025 09:03 IST
Jubilee Hills By Election 2025 Results: హాఫ్‌సెంచరీ లీడ్ దాటేసిన ఎన్డీయే
- బిహార్ ఫలితాల్లో ఎన్డీయే ఆధిక్యం
- మొత్తం 243 స్థానాల్లో 99 స్థానాలకు ఎర్లీ ట్రెండ్స్
- 63 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు
- 34 స్థానాల్లో మహాగఠ్‌బంధన్ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు
- 2 స్థానాల్లో జన్ సురాజ్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు
- Nov 14, 2025 09:00 IST
Jubilee Hills By Election 2025 Results:
- తొలి రౌండ్ లో కాంగ్రెస్ 8926, BRS 8864 ఓట్లు
- 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
- Nov 14, 2025 08:56 IST
షేక్ పేట్ లో కాంగ్రెస్ దూకుడు
- Nov 14, 2025 08:55 IST
కాంగ్రెస్ 47, BRS 43, బీజేపీ 11 ఓట్లు
- Nov 14, 2025 08:54 IST
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ కు ఆధిక్యం
- Nov 14, 2025 08:52 IST
షేక్ పేట్ తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి.. రెండవ రౌండ్ లెక్కింపుతో తేలిపోనున్న షేక్ పేట్ ఫలితం
- Nov 14, 2025 08:51 IST
ఈవీఎంల లెక్కింపు తొలి రౌండ్ లీడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
- Nov 14, 2025 08:48 IST
కౌంటింగ్ కేంద్రం వద్దకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/11/14/naveen-yadav-2025-11-14-08-48-56.webp)
Naveen Yadav - Nov 14, 2025 08:47 IST
Jubilee Hills By Election 2025 Results: ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు BRS అభ్యర్థి మాగంటి సునీత
/fit-in/580x348/filters:format(webp)/rtv/media/media_files/2025/11/14/jubilee-hills-by-election-2025-11-14-08-47-43.jpeg)
Jubilee Hills By Election - Nov 14, 2025 08:45 IST
Jubilee Hills By Election 2025 Results:
- పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి...
- ఈవీఎం ల కౌంటింగ్ ప్రారంభం..
- మొదటగా షేక్ పేట్ డివిజన్ లోని 42 బాత్ ల ఈవీఎం లు లెక్కింపు..
- 30 నిముషాల్లో ఒక్కో రౌండ్ లెక్కింపు పూర్తయ్యే అవకాశం..
- Nov 14, 2025 08:24 IST
షేక్ పేట డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభం..
- Nov 14, 2025 08:24 IST
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి.. ఈవీఎంల లెక్కింపు ప్రారంభం!
- Nov 14, 2025 08:23 IST
పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యం!
- Nov 14, 2025 08:01 IST
మొదలైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్!
- Nov 14, 2025 07:35 IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ.. జోరుగా సాగుతున్న బెట్టింగ్స్..
- Nov 14, 2025 07:34 IST
రౌండ్ డివిజన్లు పోలింగ్ బూత్ నెంబర్లు
రౌండ్ 1: షేక్‌పేట – బూత్‌లు 1 నుండి 42
రౌండ్ 2: షేక్‌పేట, ఎర్రగడ్డ – బూత్‌లు 43 నుంచి 85
రౌండ్ 3: రహమత్‌నగర్, వెంగళరావునగర్ – బూత్‌లు 86 నుంచి 128
రౌండ్ 4: వెంగళరావునగర్, రహ్మత్‌నగర్ – బూత్‌లు 129 నుంచి 171
రౌండ్ 5: రహ్మత్‌నగర్, వెంగళరావునగర్ – బూత్‌లు 172 నుంచి 214
రౌండ్ 6: వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ – బూత్‌లు 215 నుంచి 257
రౌండ్ 7: యూసుఫ్‌గూడ, సోమాజిగూడ – బూత్‌లు 258 నుంచి 300
రౌండ్ 8: సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండ – బూత్‌లు 301 నుంచి 343
రౌండ్ 9: బోరబండ, ఎర్రగడ్డ – బూత్‌లు 344 నుంచి 386
రౌండ్ 10: ఎర్రగడ్డ – బూత్‌లు 387 నుంచి 407
- Nov 14, 2025 07:09 IST
నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో ఓటింగ్ ఇలా..
- బోరబండ: 53,211 ఓట్లలో 29,760 (55.92%)
- రహమత్ నగర్: 74,387 ఓట్లలో 40,610 (54.59%)
- ఎర్రగడ్డ: 58,752 ఓట్లలో 29,112 (49.55%)
- సోమాజీగూడ: 34,653 ఓట్లలో 14,553 (41.99%)
- యూసఫ్ గూడ్: 55,705 ఓట్లలో 24,219 (43.47%)
- షేక్ పేట్: 71,062 ఓట్లలో 31,182 (43.87%)
- వెంగళ్ రావు నగర్: 53,595 ఓట్లలో 25,195 (47.00%)
- Nov 14, 2025 06:48 IST
భద్రతా చర్యల దృష్ట్యా స్టేడియం పరిసరాల్లో 144 సెక్షన్ అమలు
- Nov 14, 2025 06:47 IST
మొత్తం ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ
- Nov 14, 2025 06:47 IST
కౌంటింగ్ హాల్‌లోకి అభ్యర్థులు, వారి ఏజెంట్లకే ప్రవేశ అనుమతి
- Nov 14, 2025 06:47 IST
ఉదయం 6 నుండి 7 గంటల మధ్య రాజకీయ పార్టీల ఏజెంట్లు కేంద్రానికి రానున్నారు
- Nov 14, 2025 06:47 IST
ప్రతి టేబుల్‌కు సూపర్‌వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ నియామకం
- Nov 14, 2025 06:47 IST
లెక్కింపుకు మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు
- Nov 14, 2025 06:47 IST
మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తిచేయనున్న అధికారులు
- Nov 14, 2025 06:46 IST
కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు నిర్వహణ
- Nov 14, 2025 06:46 IST
కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం

Follow Us
/filters:format(webp)/rtv/media/media_files/2025/11/14/telangana-2025-11-14-06-36-34.jpg)