No Wedding Muhurthams: కొత్త జంటలకు షాక్..ఇప్పట్లో పెళ్లి ముహూర్తాలు లేనట్టే..కారణం ఇదే..

పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు నిజంగా ఇది షాకే అని చెప్పాలి. ఎందుకంటే.. మరో మూడు నెలలల వరకూ పెళ్లికి అసలు ముహూర్తాలే లేవట. దీంతో పెళ్లితో పాటు  గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు చేపట్టే వారికి శుక్ర మౌడ్యమి శుభ ముహూర్తల గండం వెంటాడుతుంది.

New Update
FotoJet - 2025-11-28T115217.116

There are no wedding muhurthams right now

Subha Muhurtham :  పెళ్లి(marriage) చేసుకోవాలనుకునే జంటలకు(couples) నిజంగా ఇది షాకే అని చెప్పాలి. ఎందుకంటే.. మరో మూడు నెలలల వరకూ పెళ్లికి అసలు ముహూర్తాలే లేవట. దీంతో పెళ్లితో పాటు  గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు చేపట్టే వారికి కష్టాలు మొదలయ్యాయి.  అవును కొత్తజంటలకు శుక్ర మౌడ్యమి శుభ ముహూర్తల గండం వెంటాడుతుంది. నవంబర్ 26 నుండి 2026 ఫిబ్రవరి 18 వరకు మంచి ముహూర్తాలు లేవని వేద పండితులు చెబుతున్నారు.. అప్పటివరకు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా వేచి చూడాల్సిందేనని చెప్తున్నారు.

ఇందుకు కారణం శుక్ర మూఢమే... మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘ మాసం బహుళ అమావాస్య వరకు.. అంటే నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 17 వరకూ 83 రోజులపాటు మౌఢ్యమి ఉంటుంది. దీంతో అప్పటి వరకూ ఎలాంటి శుభ ముహూర్తాలు లేవని  పండితులు పేర్కొంటున్నారు. సాధారణంగా గురు, శుక్ర గ్రహాలు సూర్యుడికి దగ్గరగా వచ్చే కాలాన్ని మూఢంగా పరిగణిస్తారు. ఈ సమయంలో రెండు గ్రహాలు బలంగా ఉండవని, అందుకే వివాహలు, నూతన గృహప్రవేశం, విగ్రహ ప్రతిష్ఠలు వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలం కాదని అంటున్నారు. అయితే.. అదే సమయంలో తప్పనిసరిగా చేసే పనులు, నిత్యకర్మలకు మూఢమి వర్తించదని కూడా చెప్తున్నారు.

Also Read :  మావోయిస్టుల సంచలన ప్రకటన..జనవరి 1న సామూహికంగా లొంగిపోతాం

Shock For Newlyweds No Wedding Muhurthams Right Now

నిజానికి ప్రతి సంవత్సరం మాఘమాసంలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండేవి. ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాల్స్ ఫుల్‌ బీజీగా ఉండేవి. కానీ ఈసారి మాఘమాసంలో మూఢమి ఉండటంతో పెళ్లి ముహూర్తాలు లేవు. దీంతో బుకింగ్స్ లేవని ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. 

గురుడు లేదా శుక్ర గ్రహం సూర్యుడితో కలిసుండే కాలాన్ని మౌఢ్యమి. దీన్నే వాడుకలో ‘మూఢమి’ లేదా మూఢం అని  కూడా పిలుస్తారు. మూఢమి అంటే చీకటి అని అర్థం. నవగ్రహాల్లో గురుడు, శుక్రుడు తమ గమనంలో సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహాలు తమ కాంతిని కోల్పోవడం ద్వారా మూఢమి  సంభవిస్తుంది.సూర్యుడికి, గురుడికి మధ్య 11 డిగ్రీలు, అలాగే, సూర్యుడికి శుక్రుడికి మధ్య 8డిగ్రీల దూరం, 10 డిగ్రీల దూరం గనక ఉంటే మౌఢ్యమి వస్తుంది. సౌర కుటుంబానికి పెద్ద దిక్కు సూర్యుడు. ఆయన శక్తి, కాంతి అనంతం. గురు, శుక్రుడు శుభ గ్రహాలు. ఈ గ్రహాలు మౌఢ్యమి సమయంలో తేజస్సును కోల్పోవడం వల్ల శుభకార్యాలను వాయిదా వేస్తుంటారు.  

మౌఢ్యంలో ఏమీ చేయకూడదు. గురు-శుక్ర మౌఢ్యమి సమయంలో పెళ్లిచూపులు, వివాహం, ఉపనయనం, నూతన గృహారంభం, గృహప్రవేశం, యజ్ఞాలు, వధూప్రవేశం, దేవతా ప్రతిష్ఠలు, దీక్షోపనయనం, వాహనం కొనడం, బావి-చెరువులు- బోర్లు తవ్వడం, పుట్టు వెంట్రుకలు తీయించడం, విద్యారంభ కార్యక్రమాలు, చెవులు కుట్టించడం, వ్యాపారాలను ఆరంభించడం, మహాదానాలు, యాత్రలకు వెళ్లడం, కొత్త ప్రయాణాలు ఆరంభించడం, రాజ దర్శనము, రాజ్యాభిషేకం వంటివి చేయడం నిషిద్ధం.

ముహూర్త గ్రంథాలు కొన్ని అనివార్య, నిత్య కర్మలకు ఈ మౌఢ్య దోషం వర్తించదని పండితులు చెబుతున్నారు. రోజువారీ ప్రయాణాలు, నిత్యారాధన, అభిషేకం, నవగ్రహ శాంతి, జప, హోమాది శాంతులు, సీమంతం, నామకరణం, అన్నప్రాశన కార్యక్రమాలు, పాత ఇంటి మరమ్మతులు, నూతన వస్త్రధారణ, చాతుర్మాస్య వ్రతాలు వంటివి శుక్ర మౌఢ్యమి రోజుల్లో వచ్చినా నిరభ్యంతరంగా చేయొచ్చు.  పెళ్లి ముహూర్తం కోసం మాత్రం మూడు నెలలు ఆగాల్సిందేనంటున్నారు.

Also Read :  'హైదరాబాద్ దమ్​​ బిర్యానీ' - ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్టార్ట్​ అయిందో తెలుసా?

Advertisment
తాజా కథనాలు