/rtv/media/media_files/2025/10/26/71-maoists-surrender-to-police-in-chattisgarh-2025-10-26-19-51-57.jpg)
Maoists Surrender to Police
Maoists: మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఆయుధ విరమణపై ఓ తేదీని ప్రకటించింది. జనవరి 1న ఆయుధాలను విడిచి సామూహికంగా లొంగిపోతామని తెలిపారు. జనవరి 1వ తేదీన సాయుధ కాల్పులను విరమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని వెల్లడించడం సంచలనంగా మారింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఈ మేరకు ఒక లేఖను విడుదల చేశారు. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్‌కౌంటర్‌తో పార్టీ బలహీనమైందని లేఖలో పేర్కొన్నారు. మిగతావారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని ఇటీవల మావోయిస్టులు కోరిన సంగతి తెలిసిందే.
Also Read: దారుణంగా దేశ రాజధాని..సివియర్ ఎయిర్ పొల్యూషన్ తో నరకం
పరస్పర సమన్వయం , కమ్యూనికేషన్ కోసం నక్సల్ ప్రతినిధి ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్‌ను కూడా విడుదల చేసినట్లు తెలిపారు. తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎదుట ఆయుధ విరమణ చేస్తామని స్పష్టం చేశారు. ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేర్కొన్నారు. కాగా, మావోయిస్టుల చర్యలను కట్టడి చేయడానికి కేంద్రప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన విషయం తెలిసిందే. పలువురు నాయకులను లొంగిపోయేలా చేస్తోంది. లొంగిపోని వారిని ఎన్‌కౌంటర్ల పేరుతో నిర్మూలిస్తోంది.
Also Raed: చిరంజీవిని కీర్తి సురేష్ అంత మాట అనేసిందా..? అసలేమైందంటే..!
ఈ క్రమంలోనే మావోయిస్టులను కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. ఇటీవల ఏపీలోని మారేడుమిల్లిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు పలువురు కీలక నేతలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి నెలకొంది. మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మహారాష్ట్ర–మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ (MMC) పేరిట కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపిన ఈ లేఖలో ప్రభుత్వం పిలుపు ఇస్తే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. 2026 జనవరి 1 నుంచి ఒక నెలపాటు హత్యాబంద్ (కిలింగ్ స్టాప్), పోరాట విరామం అమలు చేయాలని మావోయిస్టులు నిర్ణయించారు. ఈ విరామ సమయంలో ప్రభుత్వం చర్చల కోసం ముందుకు వస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ప్రధాన అంశాలు..
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు చర్చల కోసం ముందుకు రావాలని, దీనితో అడవి ప్రాంతాల్లో ఉన్న సమస్యలు పరిష్కార దిశగా పయనిస్తాయని వారు పేర్కొన్నారు. తాము ఇంతకుముందు 2022లో కూడా పోరాట విరామం ప్రకటించినప్పటికీ, అప్పటి ప్రభుత్వాలు స్పందించలేదని MMC పేర్కొంది. ఆ తప్పిదాన్ని ఈసారి పునరావృతం చేయకుండా, ప్రభుత్వాలు నిజమైన చర్చలకు రావాలన్నారు. అడివాసీల భూమి హక్కులు, పోలీసు దాడులు, అభివృద్ధి లోపం వంటి సమస్యలపై ప్రభుత్వాలతో ఓపెన్ డిబేట్లు, చర్చలు జరగాలని కమిటీ డిమాండ్ చేసింది. ఎన్‌కౌంటర్ పేరుతో నిరపరాధులు చనిపోతున్నారని ఆరోపిస్తూ, ఈ ఘటనలు ఆగితేనే శాంతి చర్చలు సార్థకం అవుతాయని మావోయిస్టులు పేర్కొన్నారు. చర్చలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారికంగా ప్రకటించాలని కోరారు. డిసెంబర్ 1 నుంచి జనవరి 1, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 11 నుంచి 11.15 మధ్య సంప్రదింపులకు ఓపెన్ లైన్‌గా ఒక ఫోన్ నంబర్‌ను విడుదల చేశారు. పోరాట విరామ సమయంలో ఏ దాడులు, ప్రతిదాడులు జరగకూడదని, ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని మావోయిస్టులు కోరారు.
Follow Us