Heavy Rains: మరో ఐదు రోజులు వర్షాలు...తెలంగాణకు ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌

నైరుతి రుతు పవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండ్రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం తెలిపింది. అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదురోజుల పాటు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

New Update
rain

Heavy Rains in Hyderabad

నైరుతి రుతు పవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండ్రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం తెలిపింది. అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదురోజుల పాటు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న ఐదు రోజులు ఎల్లో అలర్ట్‌, మూడో రోజు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ రోజు తెలంగాణలోని వికారాబాద్‌, రంగారెడ్డి, ములుగు, భద్రాద్రి, జయశంకర్‌, జిల్లాలకు భారీ వర్షం కురిసింది.  

Also Read :  ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 28 మంది మృతి

Heavy Rains In Hyderabad

మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయం అయ్యాయి. జవహర్‌నగర్‌లో రోడ్లపై భారీగా వరద ప్రవహిస్తోంది. శ్రీవేంకటేశ్వర కాలనీని వరద నీరు ముంచెత్తింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులపైకి వరదనీరు చేరింది. దీంతో పంజాగుట్ట -లింగంపల్లి మార్గంలో వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  పలుచోట్ల ట్రాఫిక్‌ చిక్కుకుపోయింది. మియాపూర్‌ నుంచి లింగంపల్లి రోడ్డులో హఫీజ్‌పేట క్రాస్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మరోవైపు బేగంపేటలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. వాహనాలు ముందుకు వెళ్లలేక వెనుకకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు.  ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

Also Read :  ఇజ్రాయెల్, సిరియా మధ్య కాల్పుల విరమణ

ఎల్బీనగర్‌, నాగోల్‌, ఉప్పల్‌, ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్‌, నల్లకుంట ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వాన కురిసింది. మరోవైపు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, మారేడుపల్లి, చిలకలగూడ ప్రాంతాల్లోనూ వర్షం పడింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

Also Read :  శ్రావణంలో శివపూజ అనంతరం 3 సార్లు చప్పట్లు ఎందుకు కొట్టాలి? ఆంతర్యం ఇదే!

Also Read :  జూరాలకు భారీ వరద.. 23 గేట్ల ఎత్తివేత

telangana rains today | telangana-rains | heavy rains falls in telangana | hyderabad-rains | hyderabad rains today | hyderabad rains live | hyderabad-rain | rain-alert

Advertisment
Advertisment
తాజా కథనాలు