హైదరాబాద్ లో రాత్రంతా కుండపోత వర్షం | Heavy Rains In Hyderabad | Telangana Weather Update | RTV
హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా దట్టమైన మబ్బులు కమ్ముకుని చిన్నచిన్నగా మొదలైన వర్షం జోరందుకుంది. వర్షంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతోంది. ఈ రోజు ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా ఛేంజ్ అయింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, ఫిలింనగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో దంచికొడుతుంది. కోఠి, దిల్షుక్నగర్, అంబర్పేట్, ఉప్పల్, సికింద్రాబాద్‌లో సాధారణంగా వర్షం కురుస్తోంది.
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం (ఈరోజు) మధ్యాహ్నం ఆకాశంలో మేఘావృతమైంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షం కురుస్తోంది. టోలిచౌకి, మెహదీపట్నం ఏరియాలో వర్షం కురిస్తోంది. బంజారాహిల్స్, మాదాపూర్‌లో కుండపోత వర్షం పడుతోంది.