/rtv/media/media_files/2025/07/19/ceasefire-between-israel-and-syria-2025-07-19-21-07-51.jpg)
Ceasefire between Israel and Syria
Israel syria : ఇజ్రాయెల్, సిరియా లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇరు దేశాలు సీజ్ ఫైర్ కు ఒప్పకున్నాయని తుర్కియేలోని అమెరికా రాయబారి టామ్ బరాక్ శనివారం ప్రకటించారు. తుర్కియే, జోర్డాన్ సహా పొరుగు దేశాలు ఈ కాల్పుల విరమణకు మద్దతు ఇచ్చాయని తెలిపారు. ఈ ఘర్షణల్లో 300 మందికి పైగా జనం మృతిచెందారు. ఈ కాల్పుల విరమణకు ప్రాంతీయ మిత్రదేశాలు టర్కీ, జోర్డాన్ మద్దతు పలికాయి.
Also Read : నా చావుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావే కారణం... ఇరిగేషన్ ఏఈఈ లేఖ వైరల్
‘డ్రూజ్, బెడౌయిన్, సున్నీలు తమ ఆయుధాలను విడిచిపెట్టి. ఇతర మైనారిటీలతో చేరాలి. వారితో కలిసిపోయి కొత్త, ఐక్యమైన సిరియన్ గుర్తింపును నిర్మించడానికి దోహదపడాలి’ అని తెలిపారు. దక్షిణ సిరియాలోని స్వీడా ప్రావిన్స్ లో డ్రూజ్ మిలీషియాలు, సున్నీ బెడౌయిన్ తెగల మధ్య తీవ్రమైన మత హింస తర్వాత కాల్పుల విరమణ జరగడం గమనార్హం.
అయితే సీజ్ ఫైర్ ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. అంతేగాక కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్, సిరియాలు అధికారికంగా స్పందించలేదు. కాగా, సిరియాలోని స్వీడా ప్రావిన్స్ లో సిరియన్ దళాలు, డ్రూజ్ మైనారిటీ కమ్యూనిటీ మధ్య జరిగిన హింస తర్వాత ఇజ్రాయెల్ సిరియాపై దాడి చేసిన విషయం తెలిసిందే.
Also Read : శ్రీశైలం దారిలో వచ్చే దోమలపెంట, ఈగలపెంట పేర్లు మారాయి.. కొత్త పేర్లు ఏంటో తెలుసా?
సిరియాలోని డ్రూజ్ కమ్యూనిటీ జనాభా అధికంగా కలిగిన స్వీడన్ ప్రావిన్స్‌లో రోజుల తరబడి కొనసాగిన మారణహోమం దరిమిలా ఇజ్రాయెల్- సిరియాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ఘర్షణల్లో 300 మందికి పైగా జనం మృతిచెందారు. ఈ కాల్పుల విరమణకు ప్రాంతీయ మిత్రదేశాలు టర్కీ, జోర్డాన్ మద్దతు పలికాయి.
దక్షిణాన సిరియా సైనిక మోహరింపులను ఇజ్రాయెల్ వ్యతిరేకించినప్పటికీ, 48 గంటల పాటు స్వీడాకు పరిమిత సిరియన్ అంతర్గత భద్రతా దళాల ప్రవేశాన్ని అనుమతిస్తామని తెలిపింది. సిరియా కొత్త నాయకత్వం సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్‌లలోని డ్రూజ్ కమ్యూనిటీకి ముప్పు కలిగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్.. స్వీడాపై దాడులను కొనసాగించింది. స్వీడా ప్రావిన్స్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నట్లు స్థానిక వార్తా సంస్థ స్వీడా24 ప్రతినిధి ర్యాన్ మారౌఫ్ తెలిపారు.
Also Read : బెడిసికొట్టిన మర్డర్ ప్లాన్...సుపారీ ఇచ్చి దొరికిపోయిన మహిళ