BIG BREAKING: హైదరాబాద్ లో ఈరోజు భారీ వర్షం.. ఐటీ ఉద్యోగులకు ఎర్లీ లాగౌట్, WFH !
ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల నుంచే లాగౌట్ కావాలని సూచించారు.
ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల నుంచే లాగౌట్ కావాలని సూచించారు.
హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ వరద నీటితో జలమయమైపోయాయి. ఎక్కడ చూసిన అంతా వరద నీరే! దీంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపైకి వరద నీరు భారీగా రావడంతో కొన్ని చోట్ల వాహనాలు మునిగిపోతున్నాయి.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండ్రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. అదేవిధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదురోజుల పాటు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద రావడంతో పలు ఇళ్లు నీట మునిగాయి. నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.