Heavy Rains To Andhra Pradesh | ఏపీలో ఆ జిల్లాల్లో దంచుడే | Weather Report Today | RTV
తెలంగాణలో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతోంది. ఈ రోజు ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా ఛేంజ్ అయింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, ఫిలింనగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో దంచికొడుతుంది. కోఠి, దిల్షుక్నగర్, అంబర్పేట్, ఉప్పల్, సికింద్రాబాద్లో సాధారణంగా వర్షం కురుస్తోంది.
హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం (ఈరోజు) మధ్యాహ్నం ఆకాశంలో మేఘావృతమైంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షం కురుస్తోంది. టోలిచౌకి, మెహదీపట్నం ఏరియాలో వర్షం కురిస్తోంది. బంజారాహిల్స్, మాదాపూర్లో కుండపోత వర్షం పడుతోంది.