Rain Alert To Telugu States | తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు | AP & Telangana Weather Report | RTV
తెలంగాణలో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతోంది. ఈ రోజు ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా ఛేంజ్ అయింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. జూబ్లీహిల్స్, జర్నలిస్ట్ కాలనీ, మాసాబా ట్యాంక్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌లో ఎండలు దంచుతుంటే..ఇప్పుడు సడెన్ గా వెదర్ ఛేంజ్ అయింది. ఒక్కసారిగా నగరవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. తొమ్మిది గంటల వరకు కూడా ఎండగానే ఉండగా.. తరువాత నగరం మొత్తం కారు మబ్బులు కమ్మేశాయి. అయితే నగర వ్యాప్తంగా రానున్న రెండు గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పాటు పలు జిల్లాలోను భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు..