ఏపీ,తెలంగాణకు హై అలర్ట్ ..! | Rain Alert To Hyderabad | Rain Alert To Hyderabad | RTV
తెలంగాణలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, ఫిలింనగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో దంచికొడుతుంది. కోఠి, దిల్షుక్నగర్, అంబర్పేట్, ఉప్పల్, సికింద్రాబాద్లో సాధారణంగా వర్షం కురుస్తోంది.
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు బుధ, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD యెల్లో అలర్ట్ జారీ చేసింది.
ఎండలతో సతమవుతున్న తెలంగాణ వాసులకు వాతవరణ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని వెల్లడించింది.
తెలంగాణాలోని పలు జిల్లాల్లో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.