/rtv/media/media_files/2025/07/25/samaira-hullur-2025-07-25-15-06-01.jpg)
Samaira Hullur
అనుకున్న లక్ష్యాన్ని జీవితంలో సాధించాలంటే వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది ఓ కర్ణాటక యువతి. చిన్నప్పటి నుంచి పైలట్ కావాలని కలలు కని.. 18 ఏళ్లకే అనుకున్న లక్ష్యాన్ని సాధించి.. చిన్న వయస్సులోనే తన పేరును చరిత్రలో లిఖించుకుంది. ఇంతకీ ఆ యువతి ఎవరు? చిన్న వయస్సులోనే పైలట్ కావడానికి తాను ఏం చేసింది? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
చిన్నతనం నుంచే..
కర్ణాటకకి చెందిన సమైరా హుల్లూర్ చిన్నతనం నుంచే పైలట్ కావాలని కలలు కన్నది. తండ్రి అమీన్ ఇంటీరియర్ డిజైనర్ కాగా, అమ్మ ఫ్యాషన్ డిజైనర్ టీచర్. తల్లిదండ్రుల సపోర్ట్‌తో చిన్న వయస్సులోనే పైలట్ అయినట్లు సమైరా పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది. 2006 జులై 5న జన్మించిన సమైరా కేవలం 18 సంవత్సరాల వయస్సులోనే కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) పొంది చరిత్ర సృష్టించింది. ఆమె న్యూఢిల్లీలోని వినోద్ యాదవ్ ఏవియేషన్ అకాడమీ (VYAA) లో తన ప్రారంభ శిక్షణను పొందింది.
ఇది కూడా చూడండి:OTT: పోర్న్ కంటెంట్ కి చెక్... ఆ 25 ఓటీటీ యాప్‌లపై కేంద్రం నిషేధం
18 ఏళ్లు రాకముందే..
ఆ తర్వాత మహారాష్ట్రలోని బారామతిలో ఉన్న కార్వర్ ఏవియేషన్ అకాడమీలో తన విమాన శిక్షణను పూర్తి చేసింది. సమైరా 200 గంటలకు పైగా విమాన ప్రయాణ అనుభవాన్ని కలిగి ఉంది. ఇందులో రాత్రిపూట విమానాలు నడపడం, మల్టీ-ఇంజిన్ విమానాల్లో ఆపరేషన్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిర్వహించిన ఆరు పరీక్షలలో ఐదింటిని ఆమె 18 ఏళ్లు రాక ముందే క్లియర్ చేసింది. చివరి పరీక్షకు 18 ఏళ్లు నిండాలి. దీంతో 18 ఏళ్లు పూర్తి అయిన తర్వాత పూర్తి చేసింది. ఇలా చిన్న వయస్సులోనే తాను పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకుని పైలట్‌గా నిలిచింది.
ఇది కూడా చూడండి: Viral News: అక్కడేలా పెట్టావురా..! గోడపైకి ఎక్కిన కార్.. చూస్తే షాకే..
పైలట్ కావాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే?
సాధారణంగా స్కూల్ చదువుతున్న పిల్లలకు పెద్దయ్యాక ఏం అవుతావని అడిగితే ఇంజినీర్, టీచర్ అని అంటారు. కానీ సమైరా మాత్రం పైలట్ అవుతానని చెప్పేది. అసలు అంత చిన్న వయస్సులో పైలట్ కావాలనే ఆలోచన తనకు ఎలా వచ్చిందనే సందేహం మీలో రావచ్చు. చిన్నతనంలో సరదాగా ఫ్యామిలీతో బయటకు వెళ్లేటప్పుడు హెలికాప్టర్ ఎక్కింది. అప్పుడు పైలట్ పక్కన కూర్చోని ఆ డ్రస్‌ను చూస్తోంది. ఇలాంటి డ్రస్ ధరించి, విమానం నడపాలని సమైరా చిన్నతనంలోనే భావించింది. అప్పుడు బలపడిన కోరికను పెద్దయ్యాక నెరవేర్చుకుంది.
ఇది కూడా చూడండి: Crime: హైదరాబాద్ లో ఘోరం.. బర్త్ డే రోజు భార్య పీకకోసి..ముక్కలు ముక్కలుగా
అతనే స్ఫూర్తి..
పైలట్ శిక్షణ అంటే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. తల్లిదండ్రులకు కష్టమే.. కానీ కూతురు అడిగిందని, తన మాట కొట్టలేక.. కష్టపడి తన శిక్షణకు డబ్బు పెట్టారు. బాగా పేరు ఉన్న వినోద్ యాదవ్ ఏవియేషన్ అకాడమీ ఢిల్లీలో చేర్చారు. అయితే కర్ణాటకకు చెందిన తపేశ్ కుమార్ 25 ఏళ్లకే కమర్షియల్ పైలట్‌గా లైసెన్స్ అందుకున్నాడు. దీంతో సమైరా అతన్నే స్ఫూర్తిగా తీసుకుని 18 ఏళ్లకే అందుకుంది. అయితే 17 ఏళ్లలోపే ఐదు పరీక్షలను సమైరా పూర్తి చేసింది. కానీ చివర పరీక్షకు 18 ఏళ్లు నిండాలంటే అప్పటి వరకు ఆగి పూర్తి చేసింది. ఇప్పుడు పైలట్‌గా రాణిస్తూ.. ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఇది కూడా చూడండి:Varun Tej: సో క్యూట్.. అప్పుడే బేబీ కోసం వరుణ్ షాపింగ్.. ఏం కొన్నాడో చూడండి!
pilot | latest-telugu-news | Success Story