Maoist News : మావోయిస్టు అగ్రనేతకు నోటీసులు..ఇంటికి అంటించిన పోలీసులు

ఐదు దశాబ్దాలకు పైగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ అజ్ఞాత జీవితంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత మల్ల రాజిరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను పోలీసులు ఆయన ఇంటికి అతికించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లి ఆయన స్వగ్రామం.

New Update
Maoist Rajireddy

Maoist Rajireddy

ఐదు దశాబ్దాలకు పైగా మావోయిస్టు పార్టీ(Maoist Party) లో పనిచేస్తూ  అజ్ఞాత జీవితంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత మల్ల రాజిరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దానికి సంబంధించిన నోటీసులను పోలీసులు ఆయన ఇంటికి అతికించారు. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రస్తుత పెద్దపల్లి జిల్లా మంథని మండలం  ఎగ్లాస్‌పూర్‌ పరిధిలోని శాస్త్రులపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సత్తెన్న, సాయన్న, మీసాల సాయన్న, సంగ్రాం, సాగర్, అశోక్, దేశ్‌పాండేగా దళంలో ఆయన ప్రసిద్ధుడు. ఆయన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాగా, ఆయనకు చత్తీస్‌గడ్‌ రాష్ట్రం కాంకేర్‌ జిల్లా ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు, జిల్లా మొదటి అదనపు సెషన్స్‌ జడ్జి వారెంట్‌ జారీ చేశారు.

ఇది కూడా చూడండి:Wife Killed Husband: పొరిగింటి యువకుడితో ఎఫైర్.. యూట్యూబ్‌లో చూసి భర్తను చంపించిన మహిళ

క్రైం నంబర్ 09/2025, సెక్షన్లు 191(2), 191(3), 190, 109 బి.ఎన్.ఎస్. సెక్షన్‌-25లలో కేసు నమోదు చేసిన కోర్టు, ఆయనతో పాటు 27 మందిపై ఆయుధాల చట్టం, VVIP చట్టంలోని సెక్షన్లు 13, 38(2), 39(2) కింద పలు నేరాలకు పాల్పడ్డారన్న అభియోగంపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు నోటీసులు పేర్కొంటున్నాయి.ఈ ఏడాది సెప్టెంబర్ 11న కాంకేర్ ఫస్ట్ అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో హాజరు కావాలని జులై 28న ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారని ఆయన ఇంటికి పంపించిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు కాంకేర్‌ జిల్లా నుంచి వచ్చిన పోలీసులు శాస్త్రుల పల్లికి చేరుకుని ఆయన ఇంటికి నోటీసులు అతికించారు.

కాగా రాజిరెడ్డి 1970వ దశకం నుంచి  రైతు కూలి, విముక్తి పోరాటాల్లో పాల్గొన్నారు.  మీసాల రాజిరెడ్డి అలియాస్ సత్తెన్నగా గుర్తింపు పొందిన ఆయన ఆ తర్వాత  పీపుల్స్ వార్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. సింగరేణిలో కార్మిక సమాఖ్య (సికాస) కు బలమైన పునాదులు నిర్మించారన్న పేరుంది. ఆయన ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యునిగా నాయకత్వం వహిస్తున్నారు. తొలిసారి 2007లో కేరళ రాష్ట్రంలో అరెస్ట్ అయిన రాజిరెడ్డి దాదాపు రెండేళ్లు జైలు జీవితం గడిపారు. తరువాత బెయిలుపై వచ్చిన రాజిరెడ్డి తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. నాటి నుండి కూడా దండకారణ్య అటవీ ప్రాంతానికే పరిమిత మయ్యారు. అయితే అయిన ఆయన ఉనికి మాత్రం  ఇంతవరకు వెలుగులోకి రాలేదు. కేంద్ర కమిటీ సభ్యునిగా, ఒరిస్సా స్టేట్ కమిటీ, స్టేట్ రీజనల్ బ్యూరోకు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. 2009 ప్రాంతంలో బెయిల్ పై చర్లపల్లి జైలు నుండి బయటకు వచ్చిన రాజిరెడ్డి జనజీవనంలో ఉంటారని చర్చ సాగింది. కానీ, ఆయన తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. మావోయిస్టు పార్టీలో పనిచేసేందుకు తిరిగి అడవి బాట పట్టారు. తాజాగా చత్తీస్ గడ్ లోని కాంకేర్ NIA ప్రత్యేక కోర్టు, జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి వారెంట్ జారీ చేయడంతో అక్కడి పోలీసులు ఆయన స్వగ్రామానికి వచ్చి వారెంట్ నోటీసులు అంటించారు.

ఇది కూడా చదవండి:సృష్టి ఫర్టిలిటీ స్కాంలో 80 మంది శిశువుల విక్రయం.. వెలుగులోకి నమ్రత బాగోతాలు

మరణించాడని పుకార్లు...

మావోయిస్టు పార్టీ కీలక నేతగా ఉన్న మల్లా రాజిరెడ్డి (71) అలియాస్‌ సాయన్న మృతిచెందాడని గతంలో ప్రచారం సాగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మరణించినట్లు పుకార్లు షికారు చేశాయి. తొలితరం మావోయిస్టు నేతలతో రాజిరెడ్డికి కీలక సంబంధాలున్నాయి. వారి పరిచయంతో మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి అత్యంత కీలకమైన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. మావోయిస్టు అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, గణపతి తదితరులతో కలిసి పనిచేసిన ఆయన అనారోగ్యంతో చనిపోయారని ప్రచారం సాగింది. అయితే ఆ తర్వాత ఆయన బతికే ఉన్నాడని మావోయిస్టు పార్టీ ప్రకటించడంతో  కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.   

దళ సభ్యురాలితో వివాహం... 

రాజిరెడ్డి మావోయిస్టు పార్టీలోనే రత్నం అనే సభ్యురాల్ని వివాహం చేసుకున్నారు. వారికి స్నేహలతారెడ్డి అనే కుమార్తె ఉన్నారు. అయితే చిన్నతనంలోనే ఆమెను తన సోదరుడు భీమారెడ్డికి అప్పగించారు. ఆమె హైదరాబాద్‌లో ఉన్నత విద్య పూర్తిచేసి ప్రస్తుతం హైకోర్టులో లాయర్‌గా కొనసాగుతున్నారు. ఆమె భర్త ప్రొఫెసర్‌ కాశీం. ఆయన అందరికీ సుపరిచితుడే.

ఇది కూడా చదవండి:రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ : హరీశ్ రావు

maoist-rajireddy | maoists news | maoists-letter | maoists-in-india | Chhattisgarh Maoists | latest-telugu-news | latest telangana news | telugu crime news

Advertisment
తాజా కథనాలు