Harish Rao: రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ : హరీశ్ రావు

BC రిజర్వేషన్ల పేరిట ఢిల్లీలో రేవంత్ రెడ్డి చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిందని BRS నేత హరీశ్రవు ఎద్దేవా చేశారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు.. కూతవేటు దూరంలో ఉండి రాహుల్ గాంధీ ఎందుకు రాలేదని హరీశ్ రావు ప్రశ్నిస్తూ Xలో ట్వీచ్ చేశారు.

New Update
Harish Rao Vs Revanth Reddy

Harish Rao Vs Revanth Reddy

BC రిజర్వేషన్ల పేరిట ఢిల్లీలో రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిందని BRS నేత హరీశ్రవు ఎద్దేవా చేశారు. ఈ మేరకు Xలో ట్వీచ్ చేశారు.. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు.. కూతవేటు దూరంలో ఉండి రాహుల్ గాంధీ ఎందుకు రాలేదని హరీశ్ రావు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. మాకు బీసీ కన్న బిహార్ ఎన్నికలే ముఖ్యమని మల్లిఖార్జున ఖర్గే రాలేదని ఆయన విమర్శించారు. బీసీలపై రాహుల్, ఖర్గే లకు నిజాయితీ లేదని తెలంగాణ ప్రజలకు స్పష్టమైందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్ మృతి అంత్యక్రియలలో పాల్గొన్న నేపథ్యంలో ఈ రోజు జంతరమంతర్ వద్ద జరిగిన ధర్నాకు రాహుల్ గాంధీ హాజరుకాలేకపోయారు. ‘మేం గుజరాత్‌లో అడగలేదు, ఉత్తర్ ప్రదేశ్‌లో అడగలేదు, మహారాష్ట్రలో అడగలేదు తెలంగాణలోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అడుగుతున్నామని అని రేవంత్ రెడ్డి ప్రసంగిస్తే.. అదే సమయంలో రాహుల్ గాంధీ.. ‘‘ఈ పోరాటం తెలంగాణ కోసం మాత్రమే కాదు, యావత్ దేశం కోసం చేస్తున్నామని ట్వీట్ చేశారని హరీశ్ రావు చెప్పుకొచ్చారు. ఒకే రోజు, ఒకే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు, రాహుల్ గాంధీ చెప్పిన మాటలకే పొంతన లేదని విమర్శించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో, ఈ రెండు నాల్కల దోరణి చూస్తేనే అర్థమవుతున్నదని ట్విటర్‌లో రాసుకొచ్చారు. మా బీసీలంటే అంత చులకనా మిస్టర్ ఎలక్షన్ గాంధీ.. తెలంగాణ బీసీలను కాంగ్రెస్ అగ్రనేత మరోసారి వంచించారు. ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం బూటకపు హామీలు.. అబద్ధపు డిక్లరేషన్‌లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ఢిల్లీ నడివీధుల్లో మరోసారి బట్టబయలైందని ట్వీట్ చేశారు.

Advertisment
తాజా కథనాలు