Kaleshwaram Project: 'మేడిగడ్డ' ఘటనపై మావోయిస్టుల లేఖ.. సీఎం కేసీఆర్పై సీరియస్..
మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై మావోయిస్టులు తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ లేఖ విడుదల చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కేసీఆర్ కుటుంబమే కారణమని ఆరోపించారు. పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుని నాసిరకంగా నిర్మించారన్నారు. నిర్మాణ సమయంలోనే పగుళ్లు ఏర్పడినా, బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదన్నారు. ప్రజలను, ప్రజాసంఘాలను కూడా అడ్డుకున్నారని అన్నారు.